Twitter Warning Label : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. ఆ పోస్టులకు ఇలా చెక్ పెట్టొచ్చు!

Twitter Warning Label : మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అభ్యంతరకర పోస్టులకు, ఫొటొలు, వీడియోలకు వార్నింగ్ లేబుల్ యాడ్ చేయొచ్చు.

Twitter Warning Label : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అభ్యంతరకర పోస్టులకు, ఫొటొలు, వీడియోలకు వార్నింగ్ లేబుల్ యాడ్ చేయొచ్చు. ట్విట్టర్ ఫ్లాట్ ఫాంపై ఎవరైనా యూజర్ తమ పోస్టులో అభ్యంతరకరమైన పోస్టులను పెడితే దానికి మీరు వార్నింగ్ లేబుల్ పెట్టొచ్చు.

ఇలా పెట్టడం ద్వారా ట్విట్టర్ ఆ పోస్టుపై అభ్యంతరాలేంటో తెలుస్తుంది. తద్వారా ఆ పోస్టును డిలీట్ చేయడం లేదా అలర్ట్ చేయడం చేస్తుంది. ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ఫేస్ బుక్‌లో వచ్చేసింది. ఈ ఫీచర్‌ సాయంతో పోస్ట్‌ చేసే వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపవచ్చు. ఇప్పుడీ ఈ ఫీచర్‌ను ట్విట్టర్‌ కూడా తీసుకొచ్చింది. వార్నింగ్ లేబుల్ ఫీచర్‌ ద్వారా యూజర్‌ ట్వీట్‌కు ఫోటో లేదా వీడియోను కానీ యాడ్‌ చేసుకోవచ్చు. పోస్టుకు పైభాగంలో మూడు చుక్కలను క్లిక్ చేయాలి.

అప్పుడు మీకు అక్కడ ఎడిట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే చాలు.. చివరిలో ఒక ఫ్లాగ్ ఐకాన్‌ కనిపిస్తుంది. ఆ ఫీచర్‌లో న్యూడిటీ, హింస, సెన్సిటివ్‌ అనే 3 కేటగిరీలు ఉంటాయి. యూజర్‌ పోస్ట్‌ చేసే ఫొటో/ వీడియోకు ఏదైనా అభ్యంతరాలు
ఉంటే.. ఈ కేటగిరీల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని పోస్టు చేయాల్సి ఉంటుంది.

Twitter Warning Label : How To Add Trigger Warning On Tweets Carrying ‘sensitive’ Images 

అప్పుడు ఆ ఫొటో లేదా వీడియోను పోస్టు చేసిన తర్వాత దానిపై ఒక లేబుల్ రూపంలో డిస్ ప్లే అవుతుంది. ఒక వార్నింగ్ లేబుల్ మాదిరిగా కనిపిస్తుంది. ఆ అభ్యంతర వీడియో లేదా ఫొటోను చూడాలనుకుంటే.. ఆ లేబుల్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. ఈ వార్నింగ్ లేబుల్ ఫీచర్ ఒక ఫొటో లేదా వీడియోకు మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు చూసే యూజర్ కు కంటెంట్ వార్నింగ్ లేబుల్ మెసేజ్ కనిపిస్తుంది.

Twitter Warning Label : ఈ వార్నింగ్ లేబుల్ ఎలా యాడ్ చేయాలంటే? :

– మీ ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వండి.. మీ ట్వీట్ కంపోజ్ చేయండి.
– మీరు కంపోజ్ చేసే ట్వీట్ డ్యాష్ బోర్డు పైభాగంలో ఒక Flag కనిపిస్తుంది.
– పోస్టుకు పైభాగంలో మూడు చుక్కలను క్లిక్ చేయాలి.
– మీకు అక్కడ ఎడిట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది
– దానిపై క్లిక్‌ చేస్తే చాలు.. చివరిలో ఒక ఫ్లాగ్ ఐకాన్‌ కనిపిస్తుంది.
– ఆ ఫీచర్‌లో న్యూడిటీ, హింస, సెన్సిటివ్‌ అనే 3 కేటగిరీలు కనిపిస్తాయి.
– పోస్ట్‌ చేసే ఫొటో/ వీడియోకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఏదైనా ఒకటి యాడ్ చేయొచ్చు.

Read Also :  Twitter Flock Feature : ఇన్‌స్టా మాదిరిగా ట్విట్టర్‌లో సరికొత్త ఫీచర్.. గ్రూపుల్లోనూ షేర్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు