Michael Jackson:మైఖేల్‌జాక్సన్ నాలో ఉన్నాడు..తింటాడు, పాడుతాడు,డ్యాన్స్ చేస్తాడు

మైఖేల్ జాక్సన్ దెయ్యంగా మారాడని..తనలోనే ప్రవేశించడాడని..తనలో ఉండి పాటలు పాడుతన్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు, తనకిష్టమైన ఆహారం తింటున్నాడని అంటోందో మహిళ

Michael Jackson Ghost : మైఖేల్‌ జాక్సన్‌. పాప్ సింగర్, డ్యాన్స్ కు ఐకాన్. చనిపోయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అమేజింగ్ డాన్సర్. నరాలను మెలికలు తిప్పి డాన్స్ చేసే మైఖేల్ జాక్సన్ తన శరీరంలో ప్రవేశించి డ్యాన్స్‌ చేస్తున్నాడనీ..పాటలు పాడుతున్నాడనీ, తనకు ఇష్టమైన ఆహారాన్ని తనలోనే ఉండి తింటున్నాడని తనతో మైఖేల్‌ జాక్సన్‌ ఆత్మ తన శరీరంతో శృంగారం తప్ప అని పనులు చేస్తున్నాడని ఓ మహిళ సంచలన వ్యాఖ్యలుచేసింది.

యూకేకు చెందిన కాథ్లీన్‌ రాబర్ట్స్‌ అనే మహిళ తాను మార్లీన్‌ మన్రో పునర్జన్మ అంటోంది. అంతేకాదు మైఖేల్ జాక్సన్‌ తనను పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది.ఈ విషయాలను న్నింటిని కాథ్లీన్‌ 2020లో ఓ ప్రింట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పగా వారు దాన్ని ప్రచురించటంతో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..మైఖేల్ జాక్సన్ నాలో ఉండి చేసే పనుల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను.నా అనుభవాలను మీతో పంచుకోవలనుకుంటున్నాను. నేను మైఖేల్ జాక్సన్ దెయ్యంతో కలిసి జీవిస్తున్నాను. మైఖేల్‌ అనుక్షణంతో నాలోనే ఉంటాడు. నాతోనే ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వస్తాడు.. ఆఖరికి రెస్ట్‌రూమ్‌కు కూడా నాతో పాటే వస్తాడు. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధ క్షణాలను అతడు టాయిలెట్రైస్‌ అని అంటాడు. మైఖేల్‌ నాతో చాలా విషయాలు మాట్లాడతాడు. టీవీల్లో మనం చూసే మైఖేల్‌ జాక్సన్‌ చాలా సిగ్గుపడుతూంటాడు.

కానీ నాలో ఉన్న మైఖేల్‌ జాక్సన్‌ అలా కాదు చాలా డిఫరెంట్ గా ఉంటాడు. ‘‘మైఖేల్‌ జాక్సన్‌ నాలో ఉండి విశ్రాంతి తీసుకుంటాడు.. నా శరీరంలో ఉండి ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఓ భర్తలా నాతో మాట్లాడతాడు. తనకు కుకీస్‌ అంటే చాలా ఇష్టం. నాలో ఉండి వాటిని తింటాడు. తను నా శరీరంతో అన్ని పనులు చేస్తాడు. శృంగారం తప్ప..అదికూడా నేను నేను ప్రయత్నిస్తే..అని చెప్పింది. నేను చేసే తప్పులను నాకు ఎత్తి చూపుతాడు అని చెప్పుకొచ్చిందామె.కాగా..ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పాప్ సింగర్, డాన్సర్ మైఖేల్‌ జాక్సన్‌ 2009లో జూన్‌ 25న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అతని మరణం తరువాత పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం అయిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు