Karnataka Polls: యడియూరప్పను హింసించారట.. ఆయన కన్నీళ్లే బీజేపీని ఓడిస్తాయంటున్న డీకే

పార్టీ పార్లమెంటరీ కమిటీలో యడియూరప్పకు స్థానం కల్పించడంపై సముఖంగానే ఉన్నారన్న ప్రశ్నపై ‘‘ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. సొంత పార్టీ నుంచి, ఏజెన్సీల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. కనీసం ఆయనకు పార్టీని వీడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు’’ అని డీకే శివకుమార్ అన్నారు

Karnataka Polls: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పను భారతీయ జనతా పార్టీ నేతలు హింసించారని, ఆయన కన్నీళ్లేల ఆ పార్టీని ఓడిస్తాయని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. యడియూరప్పను బీజేపీ చాలా ఇబ్బందిపెట్టిందని, ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయమేనని ఆయన అన్నారు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన ‘కర్ణాటక రౌండ్ టేబుల్ -2023’ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలోనే బీజేపీ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.

Etala Rajender : కన్నీరు పెడుతూ కూడా సంస్కారం లేకుండా మాట్లాడినావు : రేవంత్ వ్యాఖ్యలకు ఈటల కౌంటర్

‘‘బీఎస్ యడియూరప్పను చాలా హింసించారు. ఇదేమీ అంత పెద్ద సీక్రెట్ కాదు. దాన్ని ఎవరూ దాచలేరు. ఆయన కన్నీళ్లు ఇప్పటికీ కర్ణాటక వీధుల్లో కనిపిస్తూనే ఉన్నాయి’’ అని అన్నారు. అయితే పార్టీ పార్లమెంటరీ కమిటీలో యడియూరప్పకు స్థానం కల్పించడంపై సముఖంగానే ఉన్నారన్న ప్రశ్నపై ‘‘ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. సొంత పార్టీ నుంచి, ఏజెన్సీల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. కనీసం ఆయనకు పార్టీని వీడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు’’ అని డీకే శివకుమార్ అన్నారు.

Karnataka elections 2023: కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు సీపీఐ ప్రకటన.. కర్ణాటక పర్యటనలో రాహుల్ గాంధీ

లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్ప నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. పార్టీలోని నేతలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న యడియూరప్పను మళ్లీ రంగంలోకి దింపారు. ఎన్నికల బాధ్యత పూర్తిగా ఆయనకు అప్పగించారు.

ట్రెండింగ్ వార్తలు