Mahesh Babu Pokiri Re-Release : పోకిరి వరల్డ్ వైడ్ రీ రిలీజ్.. 16 ఏళ్ళైనా తగ్గని క్రేజ్.. టికెట్లు మొత్తం సేల్..

తాజాగా ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నారు. పోకిరి సినిమాని రీమాస్టర్ చేసి 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో కూడా............

Mahesh Babu Pokiri Re-Release : పూరీజగన్నాధ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి మహేష్ కి సూపర్ స్టార్ డం తెచ్చిపెట్టింది. అప్పట్లోనే 80 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా అయింది పోకిరి.

తాజాగా ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నారు. పోకిరి సినిమాని రీమాస్టర్ చేసి 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నచోట పోకిరి సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పెట్టగా అన్ని చోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో మరోసారి పోకిరి సినిమా, మహేష్ రేంజ్ ఏంటో అర్ధమవుతుంది.

Megastar Chiranjeevi : క్లాస్ అయినా మాస్ అయినా బాస్ తర్వాతే..

పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 60 థియేటర్స్, తెలంగాణలో 42 థియేటర్స్‌లో, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మరో 33 స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి తెలుగు వాళ్ళు ఉండే దేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్స్ అన్ని చోట్ల బుకింగ్ అయిపోవడంతో మరిన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సారి మహేష్ బర్త్ డేకి థియేటర్స్ లో హంగామా షురూ అంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు