Bihar CM Nitish Kumar Resigned : బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా..ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు!

బీహార్ సీఎం పదవికి నితీశ్‌కుమార్ రాజీనామా చేశారు. నితీశ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. మంగళవారం (ఆగస్టు9,2022) సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యుల మద్దతు లేఖను గవర్నర్ కు ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నితీశ్ కుమార్ అడుగులు వేస్తున్నారు.

Bihar CM Nitish Kumar Resigned : బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. సీఎం పదవికి నితీశ్‌కుమార్ రాజీనామా చేశారు. నితీశ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. మంగళవారం (ఆగస్టు9,2022) సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యుల మద్దతు లేఖను గవర్నర్ కు ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నితీశ్ కుమార్ అడుగులు వేస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో నితీశ్ మరోసారి సీఎం పదవి చేపట్టనున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీశ్ మళ్లీ ప్రభుత్నాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తేజస్వియాదవ్ ను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది.

బీజేపీ తమపై కుట్ర చేసిందని ఎమ్మెల్యేల వద్ద నితీశ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వంలో తేజస్వీయాదవ్‌ను కేబినెట్‌లోకి తీసుకునే యోచనలో నితీశ్ ఉన్నారు. అయితే తనకు హోంశాఖ కావాలని తేజస్వీ యాదవ్ పట్టుపడుతున్నారు. అటు బీహార్‌లో తాజా పరిణామాలపై బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. కాసేపట్లో పాట్నాకు రవిశంకర్ ప్రసాద్, సుషీల్ మోడీ చేరుకోనున్నారు. నితీశ్‌కు కౌంటర్ ఎజెండాను బీజేపీ నేతలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీకి దగ్గరయ్యేందుకు మే నెలలోనే నితీశ్ ప్రయత్నాలు చేశారు.

Bihar Political Crisis: బీహార్‌లో బీజేపీకి షాక్.. ఎన్డీయేకు నితీష్ గుడ్ బై? కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు..

తేజస్వీయాదవ్ ఇచ్చిన ఇప్తార్‌ విందుకు గతంలో నితీశ్ హాజరయ్యారు. అప్పటి నుంచే బీజేపీకి వ్యతిరేకంగా ఆర్జేడీ, జేడీయు మధ్య మంతనాలు జరిగినట్లు ప్రచారం ఉంది. అటు జేడీయు నేతలు.. నితీశ్‌నుద్దేశించి కీలక ట్వీట్లు చేస్తున్నారు. దేశం మీకోసం ఎందురు చూస్తోందని జేడీయు ఎమ్మెల్సీ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిని బట్టి చూస్తే.. ఢిల్లీలో పాగా వేసేందుకు బీహార్‌ నుంచి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు