New Year Amazon Deal: రూ.65వేల OnePlus 9Pro 5G ఫోన్ 30వేలకే!

iPhone తర్వాత అంత రేంజ్‌లో అందరూ ఇష్టంగా కొనుక్కునే బ్రాండ్ ఫోన్‌ ఏదైనా ఉంది అంటే అది OnePlus అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

OnePlus 9 Pro 5G: iPhone తర్వాత అంత రేంజ్‌లో అందరూ ఇష్టంగా కొనుక్కునే బ్రాండ్ ఫోన్‌ ఏదైనా ఉంది అంటే అది OnePlus అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెమెరా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మార్కెట్లోకి OnePlus తీసుకుని వచ్చిన ఫోన్ OnePlus 9 Pro 5G. ఇప్పుడు OnePlus 9 Pro 5Gపై ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందులో అన్ని ఆఫర్‌లతో రూ.65 వేల ఫోన్‌ను కేవలం 30 వేలకే కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ డీల్ ధర మరియు దాని ఫీచర్లను తెలుసుకోండి.

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అనేక బెస్ట్ ఫీచర్లు ఉండగా.. 5జీ కనెక్టివిటీ మోడ్‌ అందుబాటులో ఉంది. 6.7 ఇంచ్‌ లార్జ్‌ ఫ్యూయిడ్ అమోల్డ్‌ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ఈ వన్‌ ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ 2021 మోడక్‌లో లభిస్తోంది. ఇందులో మీకు 120 హెజ్‌జడ్‌ స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేట్‌ లభిస్తుంది. OnePlus 9 Pro 5G లో 48ఎంపీతో కూడిన బెస్ట్‌ కెమెరా ఉంది. ఇందులో 65 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉంది.

వాస్తవానికి దీని అసలు ధర 64,999గా ఉండగా.. ఆఫర్‌లో, ఫోన్‌ ఇన్‌స్టంట్‌గా రూ.5వేల తగ్గింపులో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికి వస్తే.. సర్టిఫై చేసిన 10 బ్యాంకు కార్డుల విషయానికి వస్తే, ఈ ఫోన్‌ ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 10శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డ్ చెల్లింపులపై అత్యధిక తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు బ్యాంకు కార్డులతో చెల్లింపుపై 5వేల తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా, యాక్సిస్ మైల్స్ & మరిన్ని క్రెడిట్ కార్డ్‌లపై వెయ్యి రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. HSBC కార్డ్‌పై 5శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్లన్నింటి తర్వాత, ఫోన్‌లో నో కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంది. ఈ ఫోన్‌పై రూ.19,900 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.

OnePlus 9 Pro 5G ఫీచర్లు:
ఈ ఫోన్‌ సిల్వర్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 48MP మెగా కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 8MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 1/1.56″ సైజు సెన్సార్‌ కలిగిన Hasselblad అభివృద్ధి చేసిన ట్రిపుల్ రేర్ కెమెరా అందుబాటులో ఉంది. 2MP మోనోక్రోమ్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 888 ప్రాసెసర్, Adreno 660 GPU ఉంది. ఫోన్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో 6.7 అంగుళాల స్క్రీన్ పరిమాణం మరియు సరికొత్త LTPO టెక్నాలజీని కలిగి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు 65W వార్ప్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్ధ్యంతో 4500 mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో 8GB RAM, 128GB స్టోరేజ్ ఉంది.

ట్రెండింగ్ వార్తలు