Sundar Pichai Advice : భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సుందర్ పిచాయ్ టిప్స్.. అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ మాదిరిగా బట్టి కొట్టడమే..!

Sundar Pichai Advice : భవిష్యత్తులో ఏఐ కారణంగా ఎక్కడా ఉద్యోగులు పోతాయనే భయాందోళనే టెక్కీలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఏఐతో టెక్కీల ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భరోసా ఇచ్చారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.

Sundar Pichai Advice : ఏఐ టెక్నాలజీ వేగంగా వృద్ధిచెందుతోంది. ఏఐ ఉద్యోగాలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల భవితవ్యం ఏంటి? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఏఐ కారణంగా ఎక్కడా ఉద్యోగులు పోతాయనే భయాందోళనే టెక్కీలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐతో టెక్కీల ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భరోసా ఇచ్చారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ప్రత్యేకించి భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో నెలకొన్న భయాందోళనలను పొగొట్టేందుకు ఆయన అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు.

Read Also : CEO Sundar Pichai : గూగుల్‌లో సుందర్ పిచాయ్ 20ఏళ్ల ప్రస్థానం.. సాధారణ ఉద్యోగి నుంచి సీఈఓ స్థాయికి..!

ఇటీవల గూగుల్ వార్షిక I/O డెవలపర్ ఈవెంట్ తర్వాత కంపెనీ ప్రధాన కార్యాలయంలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ వరుణ్ మయ్యతో పిచాయ్ మీట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఏఐ టెక్నాలజీ వృద్ధిచెందుతున్న తరుణంలో దేశంలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అని వరుణ్ పిచాయ్‌ను అడిగారు. భారత్‌లో ఏఐ మార్కెట్‌తో సహా అనేక అంశాలపై గూగుల్ సీఈఓ చర్చించారు.

ఇంటర్వ్యూలో వరుణ్ మయ్య పిచాయ్‌తో ఇలా అంటాడు.. “మీకు ఇది తెలుసో లేదో నాకు తెలియదు. కానీ, భారత్‌లో యువకులకు FAANG ఇంటర్వ్యూలను ఛేదించడానికి అవసరమైన సాయం అందించేందుకు దేశంలో మొత్తం పరిశ్రమ ఉంది. చాలా మంది విద్యార్థులు ‘స్మార్ట్’ అయినప్పటికీ, ఫండమెంటల్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. పోటీ పరీక్షల ఆలోచన నుంచి బయటపడి భవిష్యత్తు కోసం తమను తాము సిద్ధం చేసుకోవాలనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి’ అని పిచాయ్‌ని అడిగాడు.

సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవాలి :
దానికి పిచాయ్ బదులిస్తూ… టెక్కీలకు అద్భుతమైన సలహాను ఇచ్చారు. ప్రత్యేకించి రోట్ లెర్నింగ్ (బట్టికొట్టి చదవడం) గురించి ప్రస్తావించారు. అంటే.. నిజమైన విజయం అనేది విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా వస్తుందని పిచాయ్ పేర్కొన్నారు. అందరికి సులభంగా అర్థమయ్యేలా పిచాయ్ అమీర్ ఖాన్ నటించిన మూవీ 3 ఇడియట్స్ నుంచి ఐకానిక్ మోటార్ సీన్ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈ సీన్ ద్వారా ఏదైనా తెలుసుకోవడంతో పాటు దానిని అర్థం చేసుకోవడం మధ్య వ్యత్యాసాన్ని చక్కగా పిచాయ్ వివరించారు.

“మీరు సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవాలి. మీరు అలా చేస్తేనే పరివర్తన చెందగలరు.. మీ పనులను వేగంగా పూర్తి చేయగలరు ”అని పిచాయ్ సూచించారు. ఇదే పద్ధతిని నేటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లందరూ పాటించాలని సలహా ఇచ్చారు. అంతేకాదు.. ఇంటర్వ్యూలో భారతీయ మార్కెట్లో ఏఐ టెక్నాలజీ, రేపర్ స్టార్టప్‌లు, ఇతర టెక్నాలజీపై కూడా పిచాయ్ ప్రస్తావించారు. తనకు ఇష్టమైన భారతీయ వంటకాలను గురించి కూడా పిచాయ్ వెల్లడించారు. దేశంలో ప్రాంతాన్ని బట్టి వంటకాలు నచ్చుతాయని తెలిపారు.

వరుణ్ మయ్య 10 నిమిషాల నిడివి గల ఇంటర్వ్యూను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేశాడు. “వావ్.. ఎంతో గర్వకారణం.. నేను పోడ్‌కాస్ట్‌లో గూగుల్ I/Oలో సుందర్ పిచాయ్‌తో కలిసి కూర్చోవలసి వచ్చింది. ఏఐలో అద్భుతమైన పురోగతికి తగినట్టుగా భారత్ ఎలా సిద్ధంగా ఉందనే అనేక అంశాలపై ప్రస్తావనకు వచ్చాయి’’ అంటూ పోస్టు పెట్టాడు. సుందర్ పిచాయ్ ఏఐ భవిష్యత్తు గురించి చర్చిస్తున్న ఈ వీడియోకు 60వేల కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.

Read Also : Sundar Pichai : బిలియనీర్ కాబోతున్న సుందర్​ పిచాయ్​.. గూగుల్ సీఈఓ నికర సంపద 100 కోట్ల డాలర్లకు చేరువగా!

ట్రెండింగ్ వార్తలు