Bike Start Problem : హలో భయ్యా.. మీ బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్ ట్రై చేయండి!

అబ్బబ్బా.. చలికాలం వచ్చిందంటే చాలు.. వాహనాల్లో సమస్యలు.. ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. వాహనాలు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. సెల్ఫ్ స్టార్ట్ అసలే కావు.. మరి ఏం చేయాలంటారా?

Bike Start Problem in Winter Season: అబ్బబ్బా.. చలికాలం వచ్చిందంటే చాలు.. లేనిపోని సమస్యలు.. ఒకవైపు ఆరోగ్య సమస్యలు.. మరోవైపు వాహనాల్లో సమస్యలు.. ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. ఏంటిరా జీవితం అనిపిస్తుంటుంది.. ఈ చలికాలం సీజన్ సమయంలో పొద్దున్నే బైక్ బయటకు తీద్దామంటే.. స్టార్టింగ్ ప్రాబ్లమ్.. చలికాలంలో అయితే వాహనాలు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. సెల్ఫ్ స్టార్ట్ అసలే కావు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం ఉండదు. కిక్ కొడితే తప్పా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు కిక్ కొట్టినా కొన్ని బండ్లు స్టార్ట్ కావు..

మీ బైకు కూడా ఇలానే స్టార్ట్ కావడం లేదా? పొద్దుపొద్దున్నే బైక్ మెకానిక్ షాపులు కూడా తెరవరు. అయితే ఈ టిప్స్ ఫాలో కాండి.. మీ బైక్ క్షణాల్లో స్టార్ట్ అయిపోతుంది.. సాధారణంగా పొద్దున్నే బండి స్టార్ట్ చేసేటప్పుడు సెల్ఫ్ స్టార్ట్ చేస్తుంటారు. చలికాలంలో మాత్రం ఇలా అసలు చేయొద్దు. ఎందుకో తెలుసా? మీ బైకు ఇంజిన్ రాత్రంతా ఆఫ్ అయి ఉంటుందిగా.. చల్లటి వాతావరణం కారణంగా ఇంజిన్ బాగా కూల్ అయి ఉంటుంది. అప్పుడు సెల్ఫ్ బటన్ పనిచేయదు. ఇంజిన్ స్టార్ట్ కావాలంటే కొంచెం వేడెక్కాలి. బ్యాటరీ వీక్ ఉన్నా కూడా సెల్ఫ్ స్టార్ట్ కాదండోయ్.. బ్యాటరీ డౌన్ అవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా బైక్ స్టార్ట్ కాదు. బ్యాటరీ పనితీరు బాగున్నప్పటికీ కూడా బైక్ స్టార్ట్ కాలేదంటే.. అప్పుడు మాత్రమే ఈ ట్రిక్స్ ట్రై చేయండి. సెల్ఫ్ స్టార్ట్ చేయకుండా కిక్ కొట్టండి.. అప్పుడు బ్యాటరీ ఆన్ అవుతుంది. కొంచెం వేడుక్కుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ స్టార్ట్ బటన్ ద్వారా స్టార్ట్ చేసుకోవచ్చు.
Read Also :  Electric Folding Bike : మడతబెట్టే మినీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసిందోచ్.. టేబుల్ కింద చుట్టేయొచ్చు!

చలికాలంలోనే అసలు సమస్య :
ఇక బైక్ పార్ట్స్‌లో మెయిన్ పార్ట్.. Spark Plug.. ఇదిగానీ సరిగా పనిచేయలేదనుకోండి.. మీ బైక్ అసలే స్టార్ట్ కాదు.. ముందుకు కదలదు అంతే.. అందుకే స్పార్క్ ప్లగ్ క్లీన్ చేసుకోవాలి. చలికాలం వంటి సీజన్లలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. చలి వాతావరణ కారణంగా స్పార్క్ ప్లగ్ జామ్ అయిపోతుంది. బైక్ సీట్ కింద టూల్ కిట్ తో సాయంతో స్పార్క్ ప్లగ్ క్లీన్ చేసుకోండి. చలికాలంలో బండి ఇంజిన్, బ్యాటరీ, ప్లగ్ కూల్ జామ్ అవుతాయి. ఇలాంటి సమయాల్లో మీరు చేయాల్సిందిల్లా ఒకటే.. అందరికి తెలిసిందే.. పొద్దుపొద్దున్నే బైక్ స్టార్ట్ కాకపోతే.. చోక్ ఆన్ చేయండి.. ఇప్పుడు కిక్ కొట్టండి. వెంటనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక చోక్ ఆఫ్ చేయండి.

మరో విషయం.. మీ బైకులో ఇంజిన్ ఆయిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంజిన్ ఆయిల్ లేకపోయినా బండి స్టార్ట్ కాదు.. చలికాలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు.. బైకులో ఇంజిన్ ఆయిల్ తరచూ మారుస్తుండాలి. చలికాలంలో ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు. ఇంజిన్ ఆయిల్ చలికి గడ్డకట్టి ఇంజిన్ పార్ట్స్‌పై పేరుకుపోయి ఉంటుంది. చలికాలంలో బండి బయటకు తీయకుండా ఇంట్లోనే ఉంచేవారు.. అవసరం ఉన్నా లేకపోయినా ఇంజిన్ స్టార్ట్ చేస్తుండాలి. కొంతసేపు అలానే ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంచి ఆపేయండి. ఎక్కువ రోజులు బండి స్టార్ట్ చేయకుండా ఉంటే కూడా బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అప్పుడప్పుడు బండి స్టార్ట్ చేస్తుంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్ రానేరాదు..

Read Also : iPhone USB Type-C : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు