Free Flight Ticket : మీ ట్రైన్ టికెట్ వెయిట్ లిస్టులో ఉందా? ఆందోళన అక్కర్లేదు.. ఈ యాప్ ద్వారా ఫ్రీగా ఫ్లైట్ టికెట్ పొందవచ్చు..!

Fre Flight Ticket : మీ ట్రైన్ టికెట్ వెయిట్ లిస్టులో ఉందా? ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదని ఆందోళన అక్కర్లేదు. సాధారణంగా రైలు టికెట్ కోసం చాలామంది ప్రయాణీకులు తమ ప్రయాణంపై ఎల్లప్పుడూ ఆత్రుతగా ఉంటుంటారు.

Free Flight Ticket : మీ ట్రైన్ టికెట్ వెయిట్ లిస్టులో ఉందా? ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదని ఆందోళన అక్కర్లేదు. సాధారణంగా రైలు టికెట్ కోసం చాలామంది ప్రయాణీకులు తమ ప్రయాణంపై ఎల్లప్పుడూ ఆత్రుతగా ఉంటుంటారు. చాలా సందర్భాలలో ఒక వెయిటింగ్ రైలు టికెట్ కన్ఫర్మ్ అయినా.. వారాంతాల్లో లేదా రద్దీగా ఉండే ప్రయాణ తేదీలలో ప్రయాణీకులకు సీట్లు లభించవు. చివరి నిమిషంలో ప్లాన్‌లను మార్చుకోవలసి ఉంటుంది. దీని కారణంగా రైల్వే ప్రయాణీకులకు సాయం చేసేందుకు టికెట్ బుకింగ్ యాప్ – ట్రైన్‌మ్యాన్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఈ యాప్ ద్వారా కంపెనీ రైలు ప్రయాణాలకు ఆఫర్ అందిస్తోంది. ఒకవేళ రైలు టికెట్ కన్ఫర్మ్ కానట్లయితే.. ప్రయాణీకులకు సాయపడేందుకు కంపెనీ ఉచితంగా విమాన టిక్కెట్లను ఏర్పాటు చేస్తుంది. ట్రైన్‌మ్యాన్ యాప్ ‘Trip Assurance’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ రైలు ప్రయాణీకులకు, వెయిట్‌లిస్ట్‌లో టిక్కెట్‌లతో సులభంగా ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవచ్చు. ట్రైన్‌మ్యాన్ ద్వారా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే ఎవరైనా యాప్‌లోనే తమ టిక్కెట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు.

ఒకవేళ ప్రయాణీకుడు ధృవీకరించిన రైలు టిక్కెట్‌ను పొందనట్లయితే.. యాప్ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను చూపే ప్రిడిక్షన్ మీటర్‌ను చూపిస్తుంది. చార్ట్ తయారీకి ముందు టిక్కెట్‌లు కన్ఫర్మ్ కాకపోతే.. ట్రిప్ అస్యూరెన్స్ ప్రయాణీకులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ప్రయాణ ఆప్షన్లను ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు. ప్రయాణీకుల టిక్కెట్ ప్రిడిక్షన్ మీటర్ 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ అని సూచిస్తే.. యాప్ ట్రిప్ అస్యూరెన్స్ రుసుం రూ. 1 వసూలు చేస్తుంది. ఒకవేళ శాతం 90 శాతం కన్నా తక్కువగా ఉంటే.. టిక్కెట్ క్లాసును బట్టి కంపెనీ నామమాత్రపు రుసుమును వసూలు చేస్తుంది.

This app offers free flight ticket if your waitlist train ticket does not get confirmed

ముఖ్యంగా, చార్ట్ ప్రిపరేషన్ సమయంలో రైలు టికెట్ కన్ఫర్మ్ అయినట్లయితే.. ట్రిప్ అస్యూరెన్స్ రుసుం కస్టమర్‌లకు రీఫండ్ చేస్తుంది. అయితే, టికెట్ కన్ఫర్మ్ కానట్లయితే.. రైల్వే ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు ట్రైన్‌మ్యాన్ ప్రయాణీకుడికి ఉచిత విమాన టిక్కెట్‌ను అందజేస్తుంది. ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్ ప్రస్తుతం అన్ని IRCTC రాజధాని రైళ్లలో దాదాపు 130 ఇతర రైళ్లలోనూ ఈ సర్వీసులను అందిస్తోంది. కంపెనీ ప్రకారం.. ట్రైన్‌మ్యాన్ యాప్ మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త ఎరా టెక్నాలజీని ఉపయోగిస్తుంది. IRCTCకి అధీకృత భాగస్వామిగా పనిచేస్తుంది. IRCTC ప్రయాణీకులకు ఇబ్బంది లేని ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్‌ను అందిస్తోంది.

వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్‌లను కన్ఫర్మ్ చేసిన టిక్కెట్‌లుగా మార్చడానికి రైలు అంచనా మోడల్ 94 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే.. కంపెనీ ఉచితంగా విమాన టిక్కెట్‌ను అందిస్తుంది. అయితే, ‘Trip Assurance’ సౌకర్యం విమానాశ్రయాలు ఉన్న నగరాలకు మాత్రమే వర్తిస్తుంది. రైలు టిక్కెట్ కన్ఫర్మ్ అయినప్పుడు.. ‘Trip Assurance’ కింద విమాన టిక్కెట్‌ను అందిస్తోంది. అయితే, విమానాశ్రయాలను కలిగి ఉన్న నగరాలకు మాత్రమే వర్తిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Reliance Jio 5G : గుజరాత్‌లోని అన్ని నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు.. యూజర్లు ఉచితంగా 1Gbps డేటా యాక్సస్ చేసుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు