Twitter: ట్విట్టర్‭లో బ్లూ బ్యాడ్జ్ ఉంటే నెలకు 20 డాలర్లు చెల్లించాలంటూ వార్తలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం

అసలు విషయం ఏంటంటే.. ట్విట్టర్‭ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన అనంతరం.. ట్విట్టర్‭లో అనేక మార్పులు జరగనున్నట్లు ఎప్పటి నుంచో జోరు ప్రచారం జరుగుతోంది. ట్వీట్ క్యారెక్టర్లు పెరగడం, ఎడిట్ బటన్ రావడం సహా అనేక మార్పుల గురించి చాలా రోజులుగానే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో బ్లూ బ్యాడ్జుకు ఫీజులు చెల్లించాలంటూ పుకార్లు రావడం గమనార్హం. అయితే బ్లూ టిక్ మెయింటేనెన్స్ చార్జ్ కాకుండా.. ఎడిట్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం ఆ మొత్తాన్ని వసూలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Twitter: ట్విట్టర్‭లో బ్లూ బ్యాడ్జ్ ఉంటే నెలకు 20 డాలర్లు చెల్లించాలంటూ ట్విట్టర్‭లోలో వార్తలు గుప్పుమంటున్నాయి. కాస్త అనుమానం కలిగించే ఈ వార్తల్లో వాస్తవానికి ఎలాంటి నిజం లేదు. నిజంగా ఇవి తప్పుడు వార్తలే. అయితే ఇలాంటి వార్తల వల్ల కొంత మంది అయోమయానికి గురవుతుంటారు. పెద్ద స్థాయిలో కాకపోయినా, కొంత స్థాయిలో ఏదో రకంగా అవి నష్టం కలిగిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి తప్పుడు సమాచారంపై ట్విట్టర్ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సమాచారం విస్తృతం కాకుండా అడ్డుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నాకు తెలిసి ఇది నిజం కాదు. ట్విట్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని నేను అనుకోవడం లేదు. ఇలాంటి సమాచారం పట్ల ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాద్యమాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు సమాచారం గురించి వెంటనే అధికారిక ప్రకటనలు చేయాలి. వారి వేదికల నుంచి ఇలాంటి సమాచారాన్ని తొలగించాలి’’ అని రాజీవ్ చంద్రశేఖరన్ అన్నారు.

అసలు విషయం ఏంటంటే.. ట్విట్టర్‭ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన అనంతరం.. ట్విట్టర్‭లో అనేక మార్పులు జరగనున్నట్లు ఎప్పటి నుంచో జోరు ప్రచారం జరుగుతోంది. ట్వీట్ క్యారెక్టర్లు పెరగడం, ఎడిట్ బటన్ రావడం సహా అనేక మార్పుల గురించి చాలా రోజులుగానే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో బ్లూ బ్యాడ్జుకు ఫీజులు చెల్లించాలంటూ పుకార్లు రావడం గమనార్హం. అయితే బ్లూ టిక్ మెయింటేనెన్స్ చార్జ్ కాకుండా.. ఎడిట్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం ఆ మొత్తాన్ని వసూలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

iPhone Factory: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీలో విజృంభిస్తున్న కోవిడ్.. భయంతో పారిపోతున్న కార్మికులు.. వీడియోలు వైరల్

ట్రెండింగ్ వార్తలు