Revanth Reddy: తెలంగాణ ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్సే: రేవంత్ రెడ్డి

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో మునుగోడుకు సంబంధించిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారం ప్రారంభించే సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

Revanth Reddy: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీయేనని, అందుకే తెలంగాణ ఇచ్చిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ గుర్తించింది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది.

Munawar Faruqui: మునావర్ షో జరిగేనా.. శిల్పకళా వేదిక వద్ద భారీ బందోబస్తు

నల్లగొండ సమస్యలకు కేసీఆర్ ఇప్పటివరకు పరిష్కారం చూపలేదు. ఇప్పటికీ పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. ఇంటింటికీ ఉద్యోగం రాలేదు. రుణమాఫీ పూర్తిగా జరగలేదు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. కేసీఆర్ సిగ్గులేకుండా ఓట్ల కోసం మునుగోడుకు వస్తున్నారు. కేసీఆర్ చేసిన తప్పులే రాష్ట్రంలో బీజేపీ చేస్తోంది. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమనే విష ప్రయోగం చేస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి గెలిచిన వారిని కొనుగోలు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ అణచివేస్తున్నారు. బీజేపీకి ఆదర్శ పురుషోత్తముడు శ్రీ రాముడు కాదు.. కేసీఆర్. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం మునుగోడు ప్రజలకు దక్కింది.

#BoycottLiger : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్‌ లైగర్.. లైగర్ టాలీవుడ్ సినిమా కాదా??

మునుగోడు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని చంపేయాలని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ కుతంత్రాలను ప్రజలు గుర్తించాలి. గిరిజనుల ఓట్లతో గెలిచిన సర్పంచ్‌లు అమ్ముడు పోతున్నారు. పోడు భూముల సమస్యలపై పోరాడుతాం’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

ట్రెండింగ్ వార్తలు