Amazon Web Services: హైదరాబాద్‌లో ప్రారంభమైన అమెజాన్ అనుబంధ సంస్థ… సంవత్సరానికి 48 వేల ఉద్యోగాలు

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అమెజాన్ అనుబంధ సంస్థ ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)’ మంగళవారం నుంచి తమ సర్వీసెస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Amazon Web Services: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ తన సేవల్ని ప్రారంభించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ సంస్థ ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ఆసియా పసిఫిక్ రీజియన్’ తమ కార్యకలాపాల్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది.

India vs New Zealand: ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ 161.. మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

ఈ విషయాన్ని సంస్థ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సంస్థ రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. దీని ద్వారా సంవత్సరానికి దాదాపు 48 వేల ఫుల్ టైం ఉద్యోగాలు వస్తాయని అంచనా. అంతేకాదు.. ఈ సంస్థ 2030 నాటికి దాదాపు 7.6 బిలియన్ డాలర్ల వరకు దేశ స్థూల జాతీయోత్పత్తికి ఉపయోగపడుతుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో ఈ సంస్థ ప్రారంభించిన రెండో రీజనల్ సెంటర్ ఇది. మొదటి సెంటర్ 2016లో ముంబైలో ప్రారంభమైంది.

డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తోపాటు పలు ఆవిష్కరణలను కొనసాగించడానికి అధునాతన ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీలకు యాక్సెస్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. మరోవైపు ఏడబ్ల్యూఎస్ సేవలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.

 

ట్రెండింగ్ వార్తలు