Bandi Sanjay: బీజేపీ సభకు హైకోర్టు అనుమతి.. ప్రశాంతంగా యాత్ర ముగిస్తామన్న బండి

బీజేపీ నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఈ సభ జరుగుతుంది. దీనికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా హాజరుకాబోతున్నారు.

Bandi Sanjay: హన్మకొండలో బీజేపీ నిర్వహించతలపెట్టిన సభకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సభకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శనివారం జరగబోతున్న సంగతి తెలిసింది. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం

శాంతి భద్రతల పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల అనుమతి లేకపోవడంతో సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం కోర్టు విచారణ జరిపింది. వాదనల అనంతరం సభ నిర్వహించుకునేందుకు అనుమతించింది. దీనికి కొన్ని షరతులు విధించింది. సభలో నేతలు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని చెప్పింది. ఈ సభకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా హాజరుకాబోతున్నారు. హైకోర్టు నిర్ణయం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

Viral Video: ఈ స్లైడ్‌పై జారితే ఒళ్లు విరగడం ఖాయం.. అయినా ఎంజాయ్ చేస్తున్న జనం.. వీడియో వైరల్

‘‘సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం భయపడుతోంది. యాత్ర సాగితే, సీఎం కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై చర్చ జరుగుతుంది. ఇదే భయంతో రేపటి బహిరంగ సభ అనుమతి రద్దు చేశారు. కారణం లేకుండానే సభను రద్దు చేసే పయత్నం చేశారు. పై నుంచి వచ్చిన ఆదేశాలనే పోలీసులు అమలు చేశారు. శాంతి భద్రతల సాకు చూపించి, సీపీ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సంగ్రామ యాత్రను ముగిస్తాం. రేపటి సభను ప్రశాంతంగా నిర్వహిస్తాం’’ అని బండి సంజయ్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు