Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీగా ధర తగ్గింపు.. ఇంతకీ, ఈ ఫోన్ కొనాలా వద్దా?

Apple iPhone 13 : అమెజాన్‌లో ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రూ. 55వేల లోపు ధర సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలు చేయాలా? వద్దా పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Apple iPhone 13 Discount : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ఆపిల్ ఐఫోన్ 13 రెండు ఏళ్ల క్రితమే లాంచ్ అయింది. ఇప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రియులలో అద్భుతమైన ఆప్షన్. ఈ ఫోన్ అమెజాన్‌లో 13 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే.. రూ. 52వేల లోపు ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ ధరను మరింత తగ్గించే అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. దీనితో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై కూడా అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. కొన్ని బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఐఫోన్‌ను రూ.52,999కి అందిస్తోంది.

Read Also : Air India Express : ఫస్ట్ టైమ్ ఓటు వేసే యువ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ అదిరే ఆఫర్.. విమాన టికెట్లపై 19శాతం తగ్గింపు!

ఐఫోన్ 13పై తగ్గింపును అందించడం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఐఫోన్ 13 అనేక సార్లు అమ్మకానికి వచ్చింది. గతంలో కొన్ని ఆకర్షణీయమైన ధరలలో కూడా అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఐఫోన్ 13 మోడల్ ధర రూ. 52,090కి అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌కి మారాలనుకుంటే.. రూ. 1,200 తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌ను రూ. 52,999కి అందిస్తోంది. మరింత తక్కువ ధరకు పొందాలంటే కొన్ని ఆఫర్‌లు ఉన్నాయి. సుమారుగా, మీరు ఫోన్‌ను రూ. 50వేల నుంచి రూ. 52వేల మధ్య పొందవచ్చు.

ఐఫోన్ 13 కొనుగోలు చేయాలా? వద్దా? :
ఐఫోన్ కొనుగోలు చేసే యూజర్లు ఐఫోన్ 12 నుంచి అప్‌గ్రేడ్ అవుతుంటే.. ఇదే సరైన సమయం. 6.1-అంగుళాల డిస్‌ప్లే, ఎ15 బయోనిక్ చిప్‌తో ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో ఐఫోన్ 14 కూడా ఆకర్షణీయమైన తగ్గింపులతో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఐఫోన్ 14 ధర రూ. 58,999కి విక్రయిస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ. 3వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే.. రూ.55,999కే ఈ ఫోన్ కొనేసుకోవచ్చు. ఐఫోన్ 13 కన్నా ఐఫోన్ 14 దాదాపు రూ. 4వేలు ఖరీదైనదిగా చెప్పవచ్చు.

రెండు ఫోన్లలో తేడాలను పరిశీలిస్తే.. :
ఐఫోన్ 13, ఐఫోన్ 14 మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఐఫోన్ 14 మోడల్ A15 బయోనిక్ చిప్‌లో అదనపు జీపీయూ కోర్‌ను కలిగి ఉంది. అంతేకాదు.. అప్‌గ్రేడ్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ హై గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అవసరమయ్యే టాస్క్ సమయంలో తేడాలు కనిపించవచ్చు. ఎ16 బయోనిక్ చిప్ ఐఫోన్ 14ప్రో, ఐఫోన్14ప్రో మ్యాక్స్ మోడళ్లకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఐఫోన్ 14 బ్యాక్ కెమెరాలో ఫోటోనిక్ ఇంజిన్‌తో తక్కువ-కాంతి ఫొటోగ్రఫీతో మరిన్ని అప్‌గ్రేడ్స్ కూడా అందిస్తుంది. అయితే, సరైన కాంతి పరిస్థితుల్లో ఫొటోగ్రఫీ ఐఫోన్ 13, ఐఫోన్ 14తో సమానంగా ఉంటుంది.

ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. :
రెండు ఫోన్‌లు 12ఎంపీ కెమెరాలపై ఆధారపడతాయి. రెండింటి మధ్య తేడా ఏమిటంటే.. ఐఫోన్ 13 2.2 ఎపర్చరుతో పోలిస్తే.. ఐఫోన్ 14 మోడల్ 1.9 ఎపర్చరును కలిగి ఉంది. కొత్త ఫోన్‌కు మరింత కాంతిని అందించడంలో సాయపడుతుంది. ఐఫోన్ 14 ఫ్రంట్ కెమెరాలో మొదటిసారిగా ఆటో-ఫోకస్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఐఫోన్ 14 తక్కువ-కాంతి పరిస్థితుల్లో మెరుగైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. పగటి వెలుగులో రెండు ఫోన్‌ల నుంచి ఫొటోలలో ఎలాంటి తేడాలు కనిపించవు. ఐఫోన్ 13, ఐఫోన్ 14 మధ్య ప్రత్యేకమైన వ్యత్యాసం ఏమిటంటే.. రెండోది రెండు భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఐఫోన్ 14 వై-ఫై కనెక్షన్ లేకుండా అత్యవసర సేవల కోసం క్రాష్ డిటెక్షన్, శాటిలైట్ కనెక్టివిటీని అందిస్తుంది.

Read Also : Google Pixel 8a Leak : గూగుల్ పిక్సెల్ 8ఎ రెండర్లు మళ్లీ లీక్.. మొత్తం 4 కలర్ ఆప్షన్లలో వస్తోంది!

ట్రెండింగ్ వార్తలు