Site icon 10TV Telugu

AP DSC Results 2025: ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి.. డౌన్‌లోడ్ మర్చిపోవద్దు..

All set for ap dsc exam 2025

AP DSC Results 2025: ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in లో తెలుసుకోవచ్చు. మొత్తం 16 వేల 347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. 3లక్షల 36వేల 307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగాయి. 92.90 శాతం మంది ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌, పాస్‌వర్డ్ లేదా అవసరమైన ఇతర వివరాలతో వ్యక్తిగత లాగిన్‌ ద్వారా వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు.

* ఏపీ మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను (https://apdsc.apcfss.in/) ఓపెన్ చేయాలి.
* ఆ తర్వాత హోంపేజీలో కనిపించే మెగా డీఎస్సీ-2025 ఫలితాలు విడుదల లింక్‌పై క్లిక్‌ చేయాలి.
* అప్పుడు క్యాండిడేట్‌ లాగిన్‌కు సంబంధించిన పాప్‌అప్‌ ఓపెన్‌ అవుతుంది.
* అందులో యూజర్ నేమ్ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి సైన్‌ ఇన్‌ అవ్వాలి.
* అక్కడ స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* అందులో అభ్యర్థులు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన మార్కులు, టెట్‌ మార్కులను పేర్కొంటూ క్వాలిఫైడ్‌/నాన్‌ క్వాలిఫైడ్‌ అనే వివరాలు ఉంటాయి.

Also Read: డిగ్రీ అర్హతతో కియాలో జాబ్స్.. మొత్తం 17 కంపెనీలు 1700 ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి

Exit mobile version