Site icon 10TV Telugu

Mega Job Mela: పది పాసైనవారికి గుడ్ న్యూస్.. 1000కి పైగా జాబ్స్ తో మెగా జాబ్ మేళా.. అస్సలు మిస్ అవకండి

Job fair at Vigyan Bharat High School, Poranki

Job fair at Vigyan Bharat High School, Poranki

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. వాటిలో ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. కొన్ని సంస్థలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో మరో జాబ్ మేళా జరుగనుంది. ఆగస్టు 12వ తేదేనా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలోని విజ్ఞాన్ భారత హై స్కూల్‌లో ఈ జాబ్ మేళా జరుగనుంది. ఈ జాబ్ మేళాలో దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. కాబట్టి, నిరుద్యోగ యువత తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఎలాంటి సందేహాల కోసం అయినా, మరిన్ని వివరాల కోసం అయినా అభ్యర్థులు ఈ 9618713243, 7981368429, 8885159008 నంబర్లను సంప్రదించవచ్చు.

సంస్థలు, ఉద్యోగ వివరాలు:

నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ లో 30 ఖాళీలు

కురకు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 40 ఖాళీలు

పేటీఎంలో 50 ఖాళీలు

రాపిడో లో 100 ఖాళీలు

బ్లింకిట్ లో 30 ఖాళీలు

స్విగ్గీలో 200 ఖాళీలు

స్విగ్గీ – ఫుడ్ డెలివరీ లో 100 ఖాళీలు

జాన్సన్ లిఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 250 ఖాళీలు

సంతోష్ ఆటోమోటార్స్ లో 30 ఖాళీలు

మెడ్‌ప్లస్ ఫార్మసీ లో 50 ఖాళీలు

జోయలుక్కాస్ లో 60 ఖాళీలు ఉన్నాయి.

ఈ సంస్థలు ఉద్యోగంతో పాటు మంచి జీతాన్ని కూడా అందిస్తున్నాయి. కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత తప్పకుండా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Exit mobile version