Site icon 10TV Telugu

Job Fair : విశాఖలో జాబ్ మేళా…200 ఉద్యోగాలు

Apssdc

Apssdc

Job Fair : ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఫిబ్రవరి 18న విశాపట్నంలో జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా ద్వారా పాత్రా ఇండియా బీపీఓ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 200 ప్రాసెస్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్ధులు ఫిబ్రవరి 17లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి మూడేళ్ళ డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హతను కలిగి ఉండాలి. ఐదేళ్ల లోపు సంబంధిత పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఏడాదికి వేతనంగా 1,45,500 చెల్లిస్తారు. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే హెచ్ ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్, సీనియర్ మేనేజర్ రౌండ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూలను విశాపట్నంలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ వుమెన్ , కాన్వెంట్ జంక్షన్ , జ్ణానాపురం నందు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్ధులు తమ అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని డాక్యుమెంట్స్ తో ఫిబ్రవరి 18, 2022 ఉదయం 9గంటలకు పై చిరునామాకు హాజరుకావాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://apssdc.in/industryplacements

Exit mobile version