ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హనుమకొండ జిల్లాలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనుంది. ఈమేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య అధికారిక ప్రకటన చేశారు. ఈ జాబ్ మేళాలో భాగంగా హనుమకొండలోని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో టెలికాలర్స్, సీసీటీవీ మానిటరింగ్, హెచ్ఆర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, యుఎస్ఐటి రిక్రూటర్స్ వంటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి, నిరుద్యోగులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్హతలు:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన వారై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుంచి 15 వేల వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
అవసరమయ్యే ధ్రువపత్రాలు:
అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, బయోడేటా, పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం 7893660741,7893398393 నెంబర్ ను సంప్రదించాలి.