Mega Job Fair in Kurnool district on August 14
ఆంద్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. చదువు అయిపోయి మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఆ అద్భుతమైన అవకాశం మీకోసమే. కర్నూలు జిల్లా డాక్టర్స్ కాలనీలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ లో రేపు అనగా ఆగస్టు 14వ తేదీన మెగా జాబ్‌మేళా జరుగనుంది. ఈ జాబ్‌మేళాలో 11 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. తమ సంస్థల్లో వివిధ విభాగాలలో ఖాలీగా ఉన్న 500 పోస్టులను భర్తీ చేయనున్నాయి. కాబట్టి, నిరుద్యోగులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఈ జాబ్ మేళా గురించిన సమాచారం కోసం ఈ నంబర్ 7780478910 ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
జె.కే. ఫెన్నర్ ఇండియా లిమిటెడ్ సంస్థలో 50 ఖాళీలు
ఫ్లిప్‌కార్ట్ లో 20 ఖాళీలు
కోజెంట్ 50 ఖాళీలు
ఓహెచ్ఎమ్ ఎలక్ట్రిక్ క్యాబ్స్ 50 ఖాళీలు
అమరరాజా 80 ఖాళీలు
ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 30 ఖాళీలు
పేటీఎం 20 ఖాళీలు
జి.ఆర్. ఇంట్రాకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ 50 ఖాళీలు
టాటా ఎలక్ట్రానిక్స్ 50 ఖాళీలు
హెట్రో ల్యాబ్స్ 50 ఖాళీలు
ఎల్ & టీ 50 ఖాళీలు