Site icon 10TV Telugu

APPRB Recruitment 2025: ఏపీలో 42 ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.1.47 లక్షల జీతం.. అర్హతలు, దరఖాస్తు, పూర్తి వివరాలు

Notification for the recruitment of Assistant Public Prosecutor posts in AP

Notification for the recruitment of Assistant Public Prosecutor posts in AP

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కొత్త నోటిఫికేషన్ విడుదళ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 42 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 11వ తేదీ నుంచి మొదలు కానుంది. కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఏపీపీ నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:

విద్యార్హతలు:
అభ్యర్థులు తప్పకుండా లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బార్ కౌన్సిల్ లో ఎన్రోల్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలోని క్రిమినల్‌ కోర్టుల్లో 04.08.2025 నాటికి కనీసం మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 01.07.2025 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటుంది.

వేతన వివరాలు:
ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతం అందుతుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Exit mobile version