Site icon 10TV Telugu

Benefits of Rose Petals : అందానికే కాదు ఆరోగ్యానికి గులాబీ రేకులు ఉపయోగకరమే!

Rose petals

Rose petals

Benefits of Rose Petals : గులాబీ పువ్వుల‌ను కేవ‌లం అలంక‌ర‌ణ కోస‌మే కాకుండా ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. గులాబీ పువ్వుల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని, చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కాపాడ‌డంలో నాటు గులాబీలు(దేశవాళీ గులాబీ) ఎంతగానో ఉపయోగపడతాయి. గులాబీ రేకుల్లో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రోజ్ ఆయిల్ నుండి తయారైన రోజ్ వాటర్ వంటలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. గులాబీ పువ్వుల నుండి తీసే నూనె శతాబ్దాలుగా పరిమళ ద్రవ్యాలలో ఉపయోగిస్తున్నారు. గులాబీ రేకుల ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

గులాబీ రేకులను నమలడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. ఇవి శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగించి బరువును నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడతాయి. గులాబీ రేకులను రోజు వారిగా నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు సులభంగా కోల్పోతారు. కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసి, చల్లరిన తరువాత తలకు రాసుకోవటం వల్ల మెదడు చల్లబడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది.

శరీరంలో చెడు కొవ్వులు పోవాలంటే గులాబీ రేకులతో తయారైన కషాయాన్ని తీసుకోవటం వల్ల మంచిఫలితం ఉంటుంది. ఇందుకోసం గులాబీ రేకులను కొన్నింటిని తీసుకుని వేడినీటిలో బాగా మరింగించాలి. తరువాత తేనె, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవటం వల్ల కొవ్వులు కరిగిపోతాయి. లైంగి సామార్ధ్యాన్ని పెంచే గుణాలు దీనిలో ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటిక్ లా పనిచేయడమే కాకుండా వాటిని తొందరగా తగ్గుతాయి.

పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు గులాబీ రేకులను తీసుకోవటం ద్వారా సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే పీచు పదార్ధం జీర్ణశక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది. గులాబీ పువ్వులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ ఎలిమెంట్ చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది. గులాబీ రేకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. రోజూ రెండు గ్రాముల గులాబీ రసం తీసుకుంటే పిత్తాశయ వికారాలు తగ్గి ఆరోగ్యం యథాస్థాయికి చేరుతుంది.

గులాబీ రేకుల‌తో త‌యారు చేసిన డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. రోజ్‌షిప్ సారం కడుపు మంటను తగ్గించడంలో తోడ్పడుతుంది. చైనీస్ వైద్యంలో జీర్ణక్రియ, రుతుక్రమ సమస్యల చికిత్స కోసం గులాబీ పువ్వులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో మారిక్ యాసిడ్‌, టానిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉండటం చేత వీటి నుండి లభ్యమయ్యే తైలాలు ఆయుర్వేద పరంగా కొన్ని రుగ్మతలకి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

ఆరు టీ స్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీ స్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి, వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత నుంచి బయటపడతారు. గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా తింటూ ఉంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.

Exit mobile version