US Ohio zoo Gorilla is Male’ అమెరికాలో ఓ వింత సంఘటన జరిగింది. ఓహి(Ohio)లోని కొలంబస్ జూ(Columbus Zoo)లో చాలా గొరిల్లాలున్నాయి. వాటిలో సుల్లీ పేరుతో ఒక గొరిల్లా ఉంది. అది ఇటీవల ఓ బుజ్జి గొరిల్లాకు జన్మనిచ్చింది. దీంతో జూ అధికారులు షాక్ అయ్యారు. సుల్లీ గొరిల్లా మగది అది బిడ్డకు జన్మనివ్వటమేంటి..? అని తెగ ఆశ్చర్యపోయారు. ఇంత కాలం మగ గొరిల్లాగా భావించిన ఆ గొరిల్లా ఆడదని తాజాగా తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. దీంతో జూ అధికారుల్ని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. అలా ఎలా అనుకుంటారు..? ఇదేనా మీ నిర్వాహణ..? అంటూ విమర్శలు సంధించారు.
దీంతో సదరు జూ అధికారులు వివరణ ఇస్తు..సాధారణంగా గొరిల్లాలు యంగ్‌గా ఉన్నప్పుడు అవి మగవా, ఆడవా అన్నది నిర్ధారించడం చాలా కష్టమని..ఎనిమిదేళ్ల వయసు వచ్చిన తర్వాతే వాటి లింగత్వం గురించి తెలుస్తుందని.. 12 ఏళ్ల తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది అందుకే తాము బిడ్డకు జన్మనిచ్చిన గొరిల్లాను మగది అని పొరపడ్డామని వివరించారు.
T-Shirt : టీ షర్టుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..? ‘టీ’ అంటే ఏమిటీ
తాజాగా బిడ్డకు జన్మనిచ్చిన ఈ సల్లీ అనే గొరిల్లాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు జూకు తీసుకొచ్చామని..అది మగదా?ఆడదా? అనేది నిర్దారించలేదని తెలిపారు జూ అధికారులు. ఈ గొరిల్లాకు పుట్టింది మాత్రం ఆడ పిల్లే అని స్పష్టం చేశారు. తల్లి గొరిల్లా తన బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. తల్లి, పిల్ల గొరిల్లాల ఆరోగ్యం గురించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా ఇక్కడ మరో విషయం ఏమిటంటే గొరిల్లాలకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు లింగ నిర్ధారణ కష్టమని చెప్పిన జూ అధికారులు పుట్టిన ఈ పిల్ల ఆడపిల్ల అని ఎలా చెప్పారు?అనేది మరో పాయింట్..ఈ విషయంపై నెటిజన్లు జూ అధికారులను మరోసారి ట్రోల్ చేయొచ్చేమో అనిపిస్తోంది.
కాగా గొరిల్లాలో సాధారణంగా ఐదు ఏళ్లకు పునరుత్పత్తి చేయటానికి అనుకూలంగా ఉంటాయి. అవి గర్భంతో ఉన్నాయని చెప్పటం కూడా కష్టమని జూ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా గొరిల్లాలకు పొట్ట భారీగా ఉంటుంది. దీంతో అవి గర్భంతోఉన్నాయో మామూలుగా ఉన్నాయో చెప్పటం కష్టమంటున్నారు. ఈక్రమంలో సుల్లీ గొరిల్లా బిడ్డకు పాలిస్తున్నట్లుగా కనిపించేసరికి జూ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు అది మగది అనుకున్నారు. కానీ ఆడదని బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు.
కాగా జూల్లో నివసించే గొరిల్లాల లింగాన్ని నిర్ణయించే విషయానికి వస్తే..వారి శరీరాలను మరింత నిశితంగా పరిశీలించడానికి అనస్థీషియాను ఉపయోగించడానికి ఆఫ్-హ్యాండ్ విధానాన్ని నిర్వహిస్తారు. సుల్లీ లాంటి ఎన్నో గొరిల్లాలో వేటాడబడి..అక్రమ వ్యాపారం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది.అంతరించిపోయేదశలో ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.