Cough Problem : దగ్గు సమస్యతో సతమతమౌతున్నారా? ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి

దగ్గుకి తేనెను మించిన ఔషధం లేదు. తేనెలో ఏమీ కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతులోపల ఓ పూతలా ఏర్పడి.. గరగరమనే మంటను తగ్గిస్తుంది. తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా తక్షణ ఉపశమనం ఉంటుంది. అల్లం టీ కూడా దగ్గుకి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

Cough Problem : వాత, పిత్త, శ్లేష్మ దోషాల కారణంగా చాలా మంది దగ్గు సమస్యను ఎదుర్కొంటుంటారు. దగ్గును నిర్లక్ష్యం చేసి దానంతట అదే తగ్గుతుందని వదిలేస్తే చివరకు అది దీర్ఘకాలిక వ్యాధిగా మారే ప్రమాదం ఉంటుంది. ఊపిరి తిత్తుల సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పొడి దగ్గు చాలా మందిని ఇబ్బందిగి గురిచేస్తుంది. దీని వల్ల గొంతుతోపాటు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. కొన్ని చిట్కాలతో దగ్గు సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలేంటో చూద్దాం..

దగ్గుకి తేనెను మించిన ఔషధం లేదు. తేనెలో ఏమీ కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతులోపల ఓ పూతలా ఏర్పడి.. గరగరమనే మంటను తగ్గిస్తుంది. తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా తక్షణ ఉపశమనం ఉంటుంది. అల్లం టీ కూడా దగ్గుకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్లాన్ని పది పన్నెండు చిన్న ముక్కలుగా కోసి.. మూడు కప్పుల నీటిలో 20 నిమిషాలు వేడి చేయండి. కాస్త చల్లారాక చెంచా తేనె కలపండి. నిమ్మకాయ రెండు చెక్కలు పిండేయండి. రుచి చూసి ఘాటుగా అనిపిస్తే కాసిని నీళ్లు కలపండి. రెండు పూటలా దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది.

చెంచా నల్ల మిరియాలకు చెంచా తేనె కలపండి. వీటిలో వేడినీళ్లు పోయండి. ఈ మిశ్రమంపై మూతపెట్టి పావుగంట తరువాత తాగితే ఫలితం ఉంటుంది. అలాగే కప్పు నీటిలో చెంచా పసుపూ, చెంచా వామూ వేసి వేడి చేయండి. నీళ్లు సగానికి సగం తగ్గేదాకా మరగనిచ్చి దించేయండి. దీనికి తేనె కలిపి రోజులో మూడుపూటలా తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

తెమడతో కూడిన దగ్గు ఉంటే అర టీస్పూన్ ఇంగువ పొడి, అర టీస్పూన్ శొంఠిపొడి, రెండు స్పూన్ల తేనె ను కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీన్ని రోజు మూడు సార్లు నోట్లో వేసుకుని రసాన్ని మింగితే దగ్గు తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే దగ్గు నుండి రిలీఫ్ వస్తుంది. పసుపులోని యాంటి సెఫ్టిక్ గుణాలు జలుబు , దగ్గులను తొలగిస్తాయి.

 

ట్రెండింగ్ వార్తలు