ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎరిక్సన్ కేసులో కోర్టు అనిల్ అంబానీని దోషిగా తేల్చింది. రూ.453 కోట్లు తక్షణమే
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎరిక్సన్ కేసులో కోర్టు అనిల్ అంబానీని దోషిగా తేల్చింది. రూ.453 కోట్లు తక్షణమే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేదంటే 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.
బకాయిలు చెల్లించనందుకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ పై ప్రముఖ స్వీడిష్ టెలికామ్ కంపెనీ ఎరిక్సన్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎరిక్సన్ ఇండియా పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 7వ తేదీన అనిల్ అంబాని, మరికొందరు రిలయన్స్ ప్రతినిధులకు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ కేసులో తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం కోర్టు జడ్జిమెంట్ ప్రకటించింది.
అనిల్ కు చెందిన రిలయన్స్ గ్రూప్.. ఎరిక్సన్ దగ్గర రూ.550కోట్ల విలువ చేసే టెలికాం పరికరాలు కొనుగోలు చేసింది. ఇందులో రూ.453 కోట్లు బాకీ పడింది. బకాయిలు చెల్లించాలని ఎరిక్సన్ అధికారులు ఎన్నిసార్లు అడిగినా.. అనిల్ అంబానీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విసిగిపోయిన ఎరిక్సన్ మేనేజ్ మెంట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తమ బకాయిలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అనిల్ ను దోషిగా తేల్చింది. వెంటనే రూ.453కోట్ల చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. లేదంటే జైల్లో పెడతామని వార్నింగ్ ఇచ్చింది. కోర్టు తీర్పు పట్ల ఎరిక్సన్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.