Site icon 10TV Telugu

UP Madrasa Act: యూపీలోని మదర్సాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

supreme court

supreme court

UP Madrasa Act : యూపీ మదర్సా చట్టం చట్టబద్ధమైనదా లేదా చట్టవిరుద్ధమైనదా.. ఈ అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. గతంలో అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. యపీలో మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు.. యూపీ మదర్సా చట్టానికి గుర్తింపు ఇచ్చింది. యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్ధించింది. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో యూపీలోని మదర్సాల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. మదర్సా చట్టంపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పుతో యూపీలోని 16వేల మదర్సాలకు ఊరట లభించింది. మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Also Read: US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన హిప్పో “మూ డెంగ్”

అక్టోబర్ 22న విచారణ పూర్తయిన తరువాత సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. అయితే, విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఫాజిల్, కమిల్ ఆధ్వర్యంలో డిగ్రీలు పట్టాలు ఇచ్చే హక్కు రాష్ట్ర పరిధిలో లేదని, ఇది యూజీసీ చట్టంలో నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. అన్ని మదర్సాలు 12వ తరగతి వరకు సర్టిఫికెట్లు ఇవ్వవచ్చునని.. అయితే, అంతకు మించి విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం మదర్సాలకు లేదని సుప్రీంకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. అంటే.. యూపీ మదర్సా బోర్డు గుర్తించిన మదర్సాలు యూజీసీ చట్టానికి విరుద్దం కాబట్టి విద్యార్థులకు కమిటి, ఫాజిల్ డిగ్రీలు ఇవ్వలేవు.

 

కమిల్ మరియు ఫాజిల్ డిగ్రీ అంటే ఏమిటి?
మదర్సా బోర్డు ‘కమిల్’ పేరుతో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను, ‘పాజిల్’ పేరుతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను ప్రధానం చేస్తోంది. దీని కింద డిప్లామా కూడా చేస్తారు. దీనిని ‘కరి’ అంటారు. బోర్డు ప్రతి సంవత్సరం మున్షీ, మౌల్వీ (10వ తరగతి), అలీమ్ (12వ తరగతి) పరీక్షలను కూడా నిర్వహిస్తోంది.

 

Exit mobile version