Site icon 10TV Telugu

Dad super idea : బుజ్జాయికి పాస్‌పోర్ట్‌ ఫొటో తీయించటానికి తండ్రి సూపర్ ఐడియా..!

father strange trick

father strange trick

father adopted a strange trick : ఓ తండ్రి తన చిట్టిపాపకు పాస్ పోర్టు ఫోటో తీయించాలనుకున్నాడు. కానీ చంటిపాప కదా నాన్నను వదలటానికి ఇష్టపడలేదు.కానీ ఫోటోలో పాప ఒక్కతే ఉండాలి. కానీ ఆ పాప నాన్నను వదలని ఏడుస్తోంది.దీంతో ఫోటోగ్రాఫర్ కు..ఆపాప తండ్రికి ఫోటో తీయటానికి తలప్రాణం తోకకువస్తోంది. దీంతో ఆ తండ్రి ఓ ఐడియా వేశాడు. దీంతో ఫోటో చక్కగా కుదిరింది…మరి ఆ నాన్న ఏంచేశాడు..? ఏం ఐడియా వేశాడో చూసేద్దాం..

సాధారణంగా చంటిపిల్లలకు హెయిర్ కటింగ్ వేయించాలన్నా..ఇంజెక్షన్ చేయించాలన్నా..పెద్ద టాస్కే..డాక్టర్, బార్బర్ ఇలా కొత్తవాళ్లు కనిపించటంతో పిల్లలు వారి అమ్మని గానీ, నాన్నని గానీ వదిలి ఉండాలంటే భయపడతారు. దీంతో వారికి ఆ పనులు చేయించాలంటే వాళ్లకు తిప్పలు తప్పవు. ఇదిగో ఇక్కడో చంటిపాపం నాన్నకు అదే పరిస్థితి వచ్చింది. పాపను పాస్ పోర్టు సైజ్ ఫోటో తీయించాలి. ఫోటో కోసం పాపను కుర్చీలో కూర్చోబెడితే ఉండటంలేదు. ఒకటే ఏడుస్తోంది. కానీ ఇద్దరిని కలిసి పాస్ పోర్టు ఫోటో తీయరు కదా..దీంతో ఆలోచించి ఆలోచించి ఆ నాన్న ఓ ఐడియా వేశాడు.

100 Rupees Note : కొత్త రూ.100 నోటు వెనుకున్న ఈ బొమ్మ గురించి తెలుసా..? ఈ అద్భుత నిర్మాణం వెనుక ఓ రాణి

పాప ఒక్కతే కుర్చీలో కూర్చోవటానికి భయపడుతోంది. దీంతో వాళ్ల నాన్న కుర్చీలో కూర్చుని..తన తలనుంచి కాళ్ల వరకు ఓ తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. అంతే ప్లాబ్లమ్ సాల్వ్..చిన్నారిని ఫోటో గ్రాఫర్ తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. నాన్న ఒడిలోనే కూర్చున్నాననే భరోసాతో చంటిపాప చక్కగా కూర్చుంది. దీంతో ఫోటో గ్రాఫర్ తన పని పూర్తి చేయటంతో వారి టాస్క్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఐడియా భలే పనిచేసింది. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన యూజర్స్‌ తండ్రి టెక్నిక్‌ను భలే ఉందంటున్నారు.మరొకరు మీ పాప భలే క్యూట్ గా ఉందని పొగిడారు. ఇంకొకరు మా అబ్బాయి ఫోటో ఇలా తీసి ఉండాల్సింది అంటూ కామెంట్స్ పెట్టారు.

Exit mobile version