తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించి గురువారం(2019 మార్చి 21) నాటికి 37ఏళ్లు. హైదారాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో విలేకరులతో తొలిసారి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎన్‌టీఆర్ ప్రకటించారు. 1982వ సంవత్సరం మార్చి 21వ తేదీన ఎన్‌టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. 29 మార్చి 1982 న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ వార్త అప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తల ద్వారా తెలుగు ప్రజలకు తెలిసింది. తర్వాత 9నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచి ముఖ్యమంత్రిగా నెగ్గారు. 10మంది కేబినేట్‌తో ఎన్‌టీఆర్ 1983వ సంవత్సరం జనవర 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.