Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు

తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు.

Rajya Sabha: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతోపాటు, కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వీరిద్దరితోపాటు పరుగుల రాణి పీటీ ఉష, సామాజిక సేవాకర్త వీరేంద్ర హెగ్డే కూడా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది.

Hyderabad: మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్టు

ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు నలుగురూ వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన ట్వీట్లు చేశారు. తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక రంగంలో సేవలందిస్తున్నారని, ఆయన సేవలు భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాయని ప్రధాని ట్వీట్ చేశారు.

Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!

సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన సేవలు తరాలపాటు నిలిచిపోతాయని, ఆయన కళ ఎన్నో భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. ఇళయరాజా జీవితం స్ఫూర్తిదాయకమని, సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, ఎంతో ఖ్యాతి సంపాదించారని ప్రశంసించారు. పీటీ ఉష ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. వైద్యం, విద్య వంటి రంగాల్లో వీరేంద్ర హెగ్డే ఎంతో గొప్ప సేవ చేశారని ప్రధాని అభినందించారు.

ట్రెండింగ్ వార్తలు