Bharath Vani Bhojan Tamil Dubbed Miral Movie Review and Rating
Miral Movie Review : ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన భరత్(Bharath) ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో పలకరించాడు. తాజాగా మిరల్ అనే సినిమాతో భరత్ నేడు మే 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భరత్, వాణి భోజన్ జంటగా శక్తివేల్ దర్శకత్వంలో తెరకెక్కిన మిరల్ సినిమా 2022లో తమిళ్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తమిళ ప్రేక్షకులను భయపెట్టిన మిరల్ ఇప్పుడు తెలుగులో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. హరి(భరత్) సివిల్ ఇంజినీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. రమ(వాణి భోజన్) తన భర్త హరిని ఎవరో ముసుగు వేసుకొని వచ్చి చంపేసినట్టు కలగంటుంది. రమకు తన చుట్టుపక్కల ఏదో జరుగుతుంది, ఎవరో తమని ఫాలో అవుతున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. దీంతో రమ తల్లి ఒకసారి ఊరికి వచ్చి కులదైవం గుళ్లో పూజలు చేయమంటుంది. రమ, హరి ఊరెళ్ళి పూజలు చేసి తిరిగొస్తుంటే వీరికి వింత అనుభవాలు ఎదురవుతాయి. రమకు వచ్చిన కల నిజం అవుతున్నట్టు ముసుగు వేసుకుకొని ఎవరో వీళ్ళని చంపే ప్రయత్నం చేస్తారు. పదేళ్ల క్రితమే ఇలాంటి ఘటన జరిగిందని అక్కడ చెప్పుకుంటారు. అసలు హరి ఫ్యామిలీని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? గతంలో ఏం జరిగింది? రమకి ఆ కల ఎందుకొస్తుంది? హరి తన ఫ్యామిలీని కాపాడుకుంటాడా? అసలు వీళ్ళని భయపెట్టేది ఎవరు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Hit List Teaser : సూర్య రిలీజ్ చేసిన ‘హిట్ లిస్ట్’ టీజర్ చూశారా?
సినిమా విశ్లేషణ.. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో దయ్యామో, ఇంకేదో అతీత శక్తి హరి ఫ్యామిలీని, రమని ఇబ్బంది పెడుతున్నట్టు చూపిస్తారు. కథ కంటే కూడా ప్రేక్షకులని భయపెట్టడంలోనే ఎక్కువ ఫోకస్ చేసారు. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఒకే ప్లాట్ లో ఆసక్తిగా వెళ్తుంది. కాని క్లైమాక్స్ లో రివీల్ చేసిన ఒక ట్విస్ట్ కి దీని కోసం ఇంత కథ, ఈ రేంజ్ లో చెప్పడం ఎందుకు అనిపిస్తుంది. మాములు కథే అయినా కథనం మాత్రం కొత్తగా రాసుకున్నారు. హారర్ ఎలిమెంట్స్ తో ఉన్న థ్రిల్లర్ సినిమా మిరల్.
నటీనటుల పర్ఫార్మెన్స్.. భరత్, వాణి భోజన్.. ఈ సినిమాని తమ భుజాలపై మోశారు అని చెప్పొచ్చు. ఈ ఇద్దరు తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో అదరగొట్టారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రలు తమ పరిధిలో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో భయపెట్టారు. కథ మాములు కథే అయినా కథనం మాత్రం బాగా రాసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే అంత బాగా రాసుకున్నా చివర్లో వచ్చే ఒక్క ట్విస్ట్ తో ఇదంతా ఎందుకు అనిపిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. దర్శకుడిగా శక్తివేల్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
మొత్తంగా మిరల్ సినిమా ఓ కుటుంబం చుట్టూ జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథ. హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను థియేటర్లో చూడొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.