Hit List Teaser : సూర్య రిలీజ్ చేసిన ‘హిట్ లిస్ట్’ టీజర్ చూశారా?

తాజాగా హిట్ లిస్ట్ టీజర్ రిలీజ్ చేసారు.

Hit List Teaser : సూర్య రిలీజ్ చేసిన ‘హిట్ లిస్ట్’ టీజర్ చూశారా?

Suriya Launched Vijay Kanishka Hit List Trailer Released

Updated On : May 17, 2024 / 3:47 PM IST

Hit List Teaser : తమిళ డైరెక్టర్ విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా ‘హిట్ లిస్ట్’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రల్లో నటించగా సూర్య కతిర్ కాకల్లార్, కే.కార్తికేయన్ దర్శకత్వంలో RK సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ KS రవికుమార్ నిర్మాణంలో ఈ హిట్ లిస్ట్ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : kannappa : ‘కన్నప్ప’లో అందాల చంద‌మామ‌.. ఇంకెంతమందిని తీసుకొస్తాడో మంచు విష్ణు..

గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజవ్వగా తాజాగా హిట్ లిస్ట్ టీజర్ రిలీజ్ చేసారు. తమిళ్ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. హీరో ఏదో సమస్యలో ఇరుక్కోవడం, ఓ సైకో హీరోని ఇబ్బంది పెట్టడం, పోలీసాఫీసర్ గా శరత్ కుమార్.. ఇలా యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లోఈ హిట్ లిస్ట్ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. మీరు కూడా హిట్ లిస్ట్ టీజర్ చూసేయండి..

టీజర్ చూసిన అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది, సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరోగా డెబ్యూట్ ఇస్తున్న విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి మంచి హీరోగా నిలబడాలి అని అన్నారు. ఇక ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో త్వరలోనే రిలీజ్ కానుంది.

Suriya Launched Vijay Kanishka Hit List Trailer Released