kannappa : ‘కన్నప్ప’లో అందాల చంద‌మామ‌.. ఇంకెంతమందిని తీసుకొస్తాడో మంచు విష్ణు..

హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప‌.

kannappa : ‘కన్నప్ప’లో అందాల చంద‌మామ‌.. ఇంకెంతమందిని తీసుకొస్తాడో మంచు విష్ణు..

Kajal Aggarwal play key role in Manchu Vishnu kannappa

Updated On : May 17, 2024 / 3:00 PM IST

హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప‌. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, స్టార్ కాస్ట్ తో కన్నప్ప సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, నయనతార, మధుబాల వంటి స్టార్ న‌టీన‌టులు భాగ‌స్వామ్యం అయ్యారు. తాజాగా మ‌రో స్టార్ హీరోయిన్ సైతం ఈ చిత్రంలో న‌టిస్తోంది.

ఆమె మ‌రెవ‌రో కాదు అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఓ మంచి పాత్ర‌లో ఆమె న‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.

Devara Shooting Update : అండమాన్ నికోబర్ దీవుల్లో రొమాంటిక్ సాంగ్ షూట్.. దేవర షూటింగ్ అప్డేట్..

ఇప్పటికే కన్నప్ప మూవీ న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా.. మే 14 నుంచి మే 25 వరకు ఫ్రాన్స్ లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప సినిమా బృందం పాల్గొననుంది. మే 20న సాయంత్రం 6 గంటలకు కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికలో కన్నప్ప టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఫ్యాన్స్‌ కన్నప్ప సినిమా టీజర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒకే ఒక్క స్టేటస్‌‌ పెట్టి అమితాసక్తి రేపిన ప్రభాస్.. త్వరలో పెళ్లి?