Devara Shooting Update : అండమాన్ నికోబర్ దీవుల్లో రొమాంటిక్ సాంగ్ షూట్.. దేవర షూటింగ్ అప్డేట్..
దేవర సినిమా ఎక్కువగా సముద్ర జలాల వెంబడి జరిగే కథ అని తెలిపారు డైరెక్టర్ కొరటాల శివ.

NTR Janhvi Kapoor Devara Movie Song Shooting Update
Devara Shooting Update : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. దేవర సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. దేవర సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఒక్క రోజు ముందు మే 19న దేవర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మూవీ యూనిట్.
దేవర సినిమా ఎక్కువగా సముద్ర జలాల వెంబడి జరిగే కథ అని తెలిపారు డైరెక్టర్ కొరటాల శివ. దీంతో షూటింగ్ ఎక్కువగా సముద్రం, బీచ్ లు ఉన్న ప్రాంతాల్లో తీస్తున్నారు. ఇప్పటివరకు దేవర సినిమా గోవా, గోకర్ణ, వైజాగ్.. లాంటి పలు ప్రాంతాల్లో షూట్ చేసారు. ఇప్పుడు అండమాన్ నికోబర్ దీవుల్లో దేవర షూట్ చేయబోతున్నట్టు సమాచారం.
Also Read : Eesha Rebba : ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. సెకండ్ లీడ్ అని చెప్పి..
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై ఓ రొమాంటిక్ సాంగ్ ని అండమాన్ నికోబర్ దీవుల్లో ఉన్న బీచ్ ల వద్ద షూటింగ్ చేయబోతున్నారట. ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిపోయాకే మే 24 నుంచి దాదాపు వారం రోజుల పాటు సాంగ్ షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, జాన్వీ పై రొమాంటిక్ సాంగ్, అది కూడా బీచ్ లో అంటే అభిమానులు గ్రాండ్ గానే అంచనాలు పెట్టుకుంటున్నారు. మరి ఆ సాంగ్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.