Monalisa: మాది లవ్ జిహాద్ కాదు.. అన్ని మతాలు సమానమే.. దర్శకుడికి మోనాలిసా సాలిడ్ కౌంటర్
తమది లవ్ జిహాద్ పెళ్లి కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మోనాలిసా(Monalisa).
Monalisa made sensational comments about her love jihad marriage
Monalisa: కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా ఓవర్ నైట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. సినిమా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్న తరుణంలో.. ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ పెను వివాదం రేగింది. ఆమె తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Divi Vadthya: తిరుమలలో నటి దివి.. స్పెషల్ ఫోటోలు వైరల్
ఈ నేపధ్యంలోనే దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసా(Monalisa) పెళ్లిపై సంచలన కామెంట్స్ చేశాడు. మోనాలిసాతో సినిమా తీయడం కోసం ఏకంగా రూ.10 కోట్ల రూపాయల అప్పు చేశానని, ఆమె వ్యవహారశైలి వల్ల తాను అరెస్టయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఆమె ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం వెనుక ‘లవ్ జిహాద్’ కోణం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.
అయితే, దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపణలపై మోనాలిసా స్పందించారు. కేరళలోని తిరువనంతపురంలో తన భర్త ఫర్మాన్ ఖాన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. “మేము హిందూ ఆచారాల ప్రకారం, హిందూ దేవాలయంలోనే పెళ్లి చేసుకున్నాం. ఇందులో ఎటువంటి లవ్ జిహాద్ లేదు. నేను అన్ని మతాలను సమానంగా చూస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మోనాలిసా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
