Eesha Rebba : ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. సెకండ్ లీడ్ అని చెప్పి..
తాజాగా ఈషారెబ్బ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అరవింద సమేత వీరరాఘవ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Eesha Rebba Sensational Comments on Aravinda Sametha Veera Raghava Movie
Eesha Rebba : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) హీరోగా పూజాహెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా వచ్చిన అరవింద సమేత వీరరాఘవ(Aravinda Sametha Veera Raghava)సినిమా మంచి విజయమే సాధించింది. ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ నటించారు. తెలుగమ్మాయి ఈషారెబ్బ కూడా ఈ సినిమాలో ఓ పాత్ర చేసింది. తాజాగా ఈషారెబ్బ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అరవింద సమేత వీరరాఘవ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈషారెబ్బ మాట్లాడుతూ.. నాగవంశీ, త్రివిక్రమ్ గారు వచ్చి కథ చెప్పి అడిగారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అందులో మీరు ఒకరు అని చెప్పారు. నేను మొదట వద్దు అన్నాను. నేను మెయిన్ లీడ్స్ చేద్దామనే అనుకుంటున్నాను అని నో చెప్పాను. కానీ త్రివిక్రమ్ గారు కథ మొత్తం చెప్పి లీడ్స్ లో ఒక క్యారెక్టర్ అనే చెప్పారు. సరే చూద్దాము అని ఓకే చెప్పాను. షూట్ కి వెళ్లే ఒక్క రోజు ముందు నేను ఆ సినిమా ఓకే చేశాను. మొదటిసారి నేను పెద్ద సినిమా చేశాను, దాంతో షూటింగ్, స్టార్ కాస్ట్.. అంతా కొత్తగా అనిపించింది. షూటింగ్ సమయంలో అంతా హ్యాపీగానే ఉంది.
నన్ను సినిమా రిలీజ్ కి ముందు సెకండ్ లీడ్ గా అనౌన్స్ చేస్తా అన్నారు, కానీ అనౌన్స్ చేయలేదు. చేస్తే నాకు హెల్ప్ అయ్యేది పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి. మా మేనేజర్ ని కూడా అడిగాను ఇలా సెకండ్ లీడ్ గా అనౌన్స్ చేస్తా అన్నారు చేయలేదు కనుక్కోమన్నాను. షూట్ అయిపొయింది, రిలీజ్ అయిపొయింది, కాని నేను హ్యాపీగా లేను. సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను. కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో తీసేసారు. నాతో ఇంకో సాంగ్ ఉంటుంది అన్నారు, అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ సినిమాకు నాకు ఉన్న హ్యాపినెస్ ఒకటే తారక్, త్రివిక్రమ్ గార్లతో కలిసి పనిచేయడం, పెద్ద ప్రొడక్షన్ పెద్ద సినిమాలో పనిచేయడం ఒకటే. సినిమా రిలీజ్ అయ్యాక నా రోల్ ఏం లేదు ఈ సినిమాలో అని నన్నే అడిగేవాళ్ళు, నేనేం చెప్పాలో నాకు తెలియలేదు. అసలు ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు ఈ సినిమా చేసారు అని నన్ను అడిగారు. కానీ ఈ సినిమా వల్ల ఒక తెలుగమ్మాయి ఈషారెబ్బ ఉందని అందరికి ఎక్కువగా తెలిసింది. సోషల్ మీడియాలో ఈ సినిమాతోనే బాగా పాపులర్ అయ్యాను అని తెలిపింది. దీంతో ఈషారెబ్బ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.