Vaishnavi Chaitanya : అందరి ముందు ఆనంద్ దేవరకొండకి కాల్ చేసి ‘లవ్ మీ’ చెప్పిన ‘బేబీ’ హీరోయిన్.. ఆనంద్ ఏమన్నాడంటే..

వైష్ణవి చైతన్య బేబీ హీరో ఆనంద్ దేవరకొండకు కాల్ చేసి 'లవ్ మీ If You Dare' అని చెప్పింది.

Vaishnavi Chaitanya : అందరి ముందు ఆనంద్ దేవరకొండకి కాల్ చేసి ‘లవ్ మీ’ చెప్పిన ‘బేబీ’ హీరోయిన్.. ఆనంద్ ఏమన్నాడంటే..

Vaishnavi Chaitanya Call to Anand Devarakonda and says Love Me video goes Viral

Updated On : May 17, 2024 / 8:52 AM IST

Vaishnavi Chaitanya : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు వైష్ణవి చైతన్య ‘లవ్ మీ’ సినిమాతో రాబోతుంది. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు(Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వలో ‘లవ్ మీ’(Love Me) సినిమా తెరకెక్కింది.

దెయ్యంతో హీరో ప్రేమాయణం అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది. లవ్ మీ టైటిల్ కి If You Dare అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా లవ్ మీ ట్రైలర్ లంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో మూవీ టైటిల్ లో డేర్ ఉంది కాబట్టి డేర్ చేయాలని వైష్ణవి చైతన్యని ఎవరైనా హీరోకి కాల్ చేసి ఈ మూవీ టైటిల్ చెప్పాలని, వాళ్ళతో కూడా చెప్పించాలని అడిగారు.

Also Read : Rajamouli – Mahesh : రాజమౌళి – మహేష్ బాబు సినిమా నటీనటుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్..

దీంతో వైష్ణవి చైతన్య బేబీ హీరో ఆనంద్ దేవరకొండకు కాల్ చేసి ‘లవ్ మీ If You Dare’ అని చెప్పింది. దాన్ని మళ్ళీ రిపీట్ చెప్పమని అడిగింది. దీంతో ఆనంద్.. నేనెందుకు చెప్పాలి. బేబీ సినిమా మొత్తం చూసాను కదా.. ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తే బాగోదేమో అని అన్నారు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. వైష్ణవి ప్రెస్ మీట్ లో ఉన్నాను, ఈ టైటిల్ రిపీట్ చెయ్యి అని చెప్పడంతో ఆనంద్ దేవరకొండ కూడా.. లవ్ మీ If You Dare అని చెప్పడంతో ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్, ప్రేక్షకులు అరుపులతో హంగామా చేసారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.