Rajamouli – Mahesh : రాజమౌళి – మహేష్ బాబు సినిమా నటీనటుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్..
రాజమౌళి - మహేష్ బాబు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ నుంచి తాజాగా ఓ అధికారిక లేఖని విడుదల చేసింది.

Rajamouli Mahesh Babu SSMB29 Movie Unit Gives Clarity on Casting Rumours
Rajamouli – Mahesh Babu : రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. మహేష్ బాబు కూడా బాగా జుట్టు పెంచి, బాడీ మీద ఫోకస్ చేసి ఈ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు కూడా ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఎవరికీ తోచింది వాళ్ళు రోజుకొక వార్తలు రాసుకుంటున్నారు.
కొద్దిరోజుల నుంచి రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో నటించే నటీనటులు వీళ్ళే అని పలువురు పేర్లు వినిపించాయి. ఇటీవల ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి పనిచేస్తున్నట్టు వార్త రాశారు. దీనిపై మూవీ యూనిట్ స్పందిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ నుంచి తాజాగా అధికారిక లేఖని విడుదల చేసింది.
Also Read : NTR – Prashanth Neel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా? ఎన్టీఆర్ బర్త్ డేకి అనౌన్స్..
శ్రీ దుర్గ ఆర్ట్స్ తమ లేఖలో.. SS రాజమౌళి & మహేష్ బాబు రాబోయే సినిమా కోసం కాస్టింగ్ రూమర్స్ పై క్లారిటీ కోసమే ఈ లేఖ. ఇటీవల ప్రముఖ సంస్థ (టైమ్స్ ఆఫ్ ఇండియా) SS రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ యొక్క కాస్టింగ్ గురించి ఒక కథనాన్ని ప్రచురించినట్లు మా దృష్టికి వచ్చింది. అందులో పేర్కొన్నదానికి విరుద్ధంగా వీరేన్ స్వామి మా సినిమాలో ఏ విధంగాను భాగం కాలేదు. దీన్ని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. అవసరమైనప్పుడు సినిమా గురించి అన్ని అధికారిక ప్రకటనలు నిర్మాణ సంస్థ తెలుపుతుంది అని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ లేఖతో అయినా SSMB29 సినిమాపై వచ్చే నటీనటుల రూమర్స్ ఆగుతాయేమో చూడాలి. అభిమానులు మాత్రం ఏదో ఒక అప్డేట్ ఇమ్మని అడుగుతూనే ఉన్నారు.
Official Clarification on Casting Rumors for SS Rajamouli & Mahesh Babu's Upcoming Film. pic.twitter.com/LKKFCMJ40p
— Vamsi Kaka (@vamsikaka) May 17, 2024