NTR – Prashanth Neel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా? ఎన్టీఆర్ బర్త్ డేకి అనౌన్స్..

తాజాగా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు మే 20న అనౌన్స్ చేస్తారని సమాచారం.

NTR – Prashanth Neel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా? ఎన్టీఆర్ బర్త్ డేకి అనౌన్స్..

NTR Prashanth Neel Movie NTR 31 Title Rumours goes in Tollywood

Updated On : May 17, 2024 / 7:49 AM IST

NTR – Prashanth Neel : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వరుసగా భారీ సినిమాలు ఓకే చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నాడు. RRR వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా ఎన్టీఆర్ సినిమా రాకపోవడంతో అభిమానులు ఆతృతగా రాబోయే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 10న దేవర పార్ట్ 1 సినిమా రానుంది. ఇక మే 19న ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఒక రోజు ముందే దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్.

ఇక దేవర తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు బానే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇవి అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే వీరికి కాంబోలో సినిమా అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : Vidya Vasula Aham : ‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ.. కొత్త జంట మధ్య అహంతో కలహాలు వస్తే..

తాజాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు మే 20న అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఒకవేళ టైటిల్ ‘డ్రాగన్’ అయితే అదిరిపోయే పర్ఫెక్ట్ టైటిల్ అవుతుంది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక KGF, సలార్ సినిమాలతో భారీ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి.