Sunday Dos and Donts : ఆదివారం నాడు ఈ పనులు చేస్తే.. దరిద్రానికి స్వయంగా ఆహ్వానం పలికినట్లే..
Sunday Dos and Donts :
hindu weekly wisdom dos and donts on sunday and not not eating non veg
Sunday Dos and Donts : ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే వారంలోని 7 రోజులకు పెద్దగా ప్రత్యేకత ఉండదు. ఒక్క ఆదివారం తప్ప. కానీ హిందూ కాలమానం ప్రకారం.. వారంలోని ఏడు రోజులను ఏడుగురు ప్రత్యేక దేవతలకు అంకితం చేశారు. దీంతో వారంలోని ప్రతి ఒక్క రోజు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అలానే ప్రతి రోజు ఆయా దేవతలకు సంబంధించి కొన్ని నియమాలు, ఆచారాలు పాటిస్తే మంచిది అంటారు పండితులు. ఈక్రమంలో 7 రోజుల్లో ఒక్కటైన ఆదివారానికి ప్రత్యేక నియమనిబంధనలు కేటాయించారు. అలానే ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని పనులు అసలే చేయవద్దు అంటున్నారు. అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని హెచ్చరిస్తున్నారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆదివారాన్ని.. గ్రహాలకు రాజుగా గుర్తించే సూర్య భగవానుడికి అంకితం చేశారు. సూర్యుడి అనుగ్రహం ఉంటే జీవితంలో అన్ని సమస్యలు తొలిగి ప్రగతి సాధిస్తారని.. ఆరోగ్యం మెరుగవుతుందని నమ్ముతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదివారం నాడు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అలానే ఆదివారం నాడు పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దని అంటున్నారు. కాదని అలాంటి పనులు చేస్తే.. దరిద్రానికి ఆహ్వానం పలికినట్లే అంటున్నారు పండితులు.
ఆదివారం చేయకూడని పనులు..
- ఆదివారం సూర్య భగవానుడికి కేటాయించారు. కనుక ఈ రోజున రాగి వస్తువులను అమ్మకూడదు. అలా చేస్తే మీ జాతకంలో సూర్యుడి స్థానం బలహీనం అవుతుంది.
- అలానే ఆదివారం నాడు గోధుమ, నలుపు, నీలం రంగుల బట్టలను ధరించకూడదు.
- ఆదివారం నాడు జుట్టు కత్తిరించుకోవడం కూడా శ్రేయస్కరం కాదంటున్నారు పండితులు. ఆదివారం నాడు జుట్టు కత్తిరించుకుంటే.. ప్రతి పనికి ఆటంకం ఏర్పడుతుంది అంటున్నారు.
- ఆదివారం నాడు పశ్చిమ దిశగా ప్రయాణం చేయకపోవడం మంచిది అంటున్నారు. ఈ రోజున శూలం పశ్చిమ దిశలో ఉంటుంది.
- అలానే ఆదివారం నాడు ఆలస్యంగా లేవకూడదు అంటున్నారు. ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు మీ జాతకంలో సూర్యుడి స్థానాన్ని బలహీనపరుస్తుంది అంటున్నారు పండితులు.
- ఆదివారం ఉప్పు వాడకూడదు.. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఉప్పు వినియోగించడం సరైనది కాదు. ఇది ప్రతి పనిలో ఆటంకాలను కలిగిస్తుందని నమ్ముతారు.
- ఆదివారం నాడు మాంసాహారం, మద్యపానం సేవించవద్దని సూర్యకష్టంలో ఉందని పండితులు అంటున్నారు.
- ఆదివారం నాడు మాంసాహారం తినడం ద్వారా అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు.
- వీకెండ్ పేరుతో ఆదివారం నాడు హైందవ సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తించవద్దు అంటున్నారు పండితులు.
