Tech Tips in Telugu : మీ మొబైల్ డేటా ఇట్టే అయిపోతుందా? ప్లాన్ మార్చకుండానే డేటా సేవ్ చేసే బిగ్ సీక్రెట్..
Tech Tips in Telugu : చాలా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో మొబైల్ డేటాను వాడేస్తుంటాయి. డేటా వేగంగా అయిపోతుంది. డేటాను సేవింగ్ చేసేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లీ మొబైల్ డేటాను డిసేబుల్ చేయండి.
Tech Tips in Telugu
- మీ మొబైల్ డేటా రీఛార్జ్ చేసిన వెంటనే అయిపోతుందా?
- రీఛార్జ్ ప్లాన్ మార్చకుండానే మొబైల్ డేటా సేవ్ చేయొచ్చు
- ఈ సింపుల్ గైడ్ ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం
Tech Tips in Telugu : మొబైల్ డేటా యూజర్లకు బిగ్ అలర్ట్.. రీఛార్జ్ చేసిన గంటల్లోనే మీ మొబైల్ డేటా అయిపోతుందా? డేటా అయిపోతుందని పదేపదే రీఛార్జ్ ప్లాన్ మార్చేస్తున్నారా? డోంట్ వర్రీ.. ఇకపై రీఛార్జ్ ప్లాన్ మార్చాల్సిన పనిలేదు. రీఛార్జ్ చేసిన వెంటనే మీ మొబైల్ డేటా తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. అవేంటో తప్పక తెలుసుకోండి.
మీకు తెలియకుండానే చాలా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో మొబైల్ డేటాను వాడేస్తుంటాయి. వివిధ స్మార్ట్‌ఫోన్ అప్డేట్లు, గూగుల్ (Tech Tips in Telugu) అప్డేట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అధిక మొత్తంలో డేటాను వాడేయడంతో డేటా ఎక్కువ సమయం రాదు. మీ మొబైల్ డేటాను సేవ్ చేయాలనుకుంటే మాత్రం ఈ కింది స్టెప్స్ ఓసారి ట్రై చేయండి..
1 : మీ ఆండ్రాయిడ్ / iOS ఫోన్లో ‘Go Settings’పై క్లిక్ చేయండి.
2 : మీరు మొబైల్ నెట్వర్క్కి వెళ్లి మీ మొబైల్ డేటాను ఆఫ్ చేయండి.
3 : “More Connections” వరకు కిందికి స్క్రోల్ చేయండి.
4 : మీ హాట్‌స్పాట్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి. అది ఆన్‌లో ఉంటే వెంటనే ఆపేయండి.
5 : ‘Data Saver’కు వెళ్లి ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఇలా మీ డేటా వాడకం లిమిట్ చేయొచ్చు.
మీరు నిద్రపోతున్నప్పుడు లేదా ప్రయాణ సమయాల్లో అవసరం లేనప్పుడు మీ మొబైల్ డేటాను స్విచ్ ఆఫ్ చేయవచ్చు. వీలైనప్పుడల్లా Wi-Fiకి మారేందుకు ట్రై చేయండి. మీ ఫ్రెండ్ ఇంటికి లేదా కేఫ్‌కు వెళ్ళినప్పుడు మీ మొబైల్ డేటాను స్విచ్ ఆఫ్ చేసి వారి Wi-Fiని వాడండి.
వై-ఫైని వాడేటప్పుడు ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను డౌన్లోడ్ చేయడం ద్వారా కూడా మీ ఆన్లైన్ వ్యూ టైమ్ లిమిట్ చేయొచ్చు. మీ ఫోన్లో ఏవైనా యాప్‌లు అప్డేట్ అయ్యాయేమో గమనిస్తూ ఉండండి. మీ పర్మిషన్ లేకుండానే వివిధ అప్లికేషన్లు వాటంతట అవే అప్డేట్ అవుతుంటాయి.
ఏవైనా ఆటో-ప్లే లేదా ఆటో-డౌన్లోడ్ సెట్టింగ్‌లను ఆఫ్ చేయండి. వాట్సాప్ వంటి అప్లికేషన్లు ఫోటోలు, వీడియోలను ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ చేస్తుంటాయి. వాట్సాప్ సెట్టింగ్‌లలో కేవలం Wi-Fi ద్వారా మాత్రమే మీడియాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఎనేబుల్ చేయవచ్చు. క్రోమ్ వంటి బ్రౌజర్లను వాడితేనే విండో తప్పకుండా క్లోజ్ చేయండి. ఎందుకంటే.. అది కూడా అధిక మొత్తంలో డేటాను వాడేస్తుంది.
ప్రో టిప్ :
అవసరమైతే Wi-Fiకి మారండి. కానీ, ఇతరుల Wi-Fi వాడే ముందు మీరు నమ్మకమైన వారిదే యాక్సస్ చేయండి. అనుమానాస్పద కేఫ్ లేదా ఇతర వై-ఫైని అసలు వాడొద్దు. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ ఫోన్ హ్యాక్ చేస్తారు జాగ్రత్త..
