Realme Narzo 100 Lite 5G : వావ్.. కొత్త రియల్‌మి నార్జో 100 లైట్ 5G ఆగయా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే.. ధర చాలా చీప్!
Realme Narzo 100 Lite 5G : రియల్‌మి ఫ్యాన్స్ కోసం భారత మార్కెట్లోకి కొత్త రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ వచ్చేసింది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల LCD డిస్ప్లే, పవర్ఫుల్ 7000mAh బ్యాటరీ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
Realme Narzo 100 Lite 5G
- రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ఫోన్ చూశారా?
- 7000mAh భారీ బ్యాటరీ, 6.8-అంగుళాల LCD డిస్ప్లే
- ఏప్రిల్ 21న నార్జో ఫోన్ సేల్, రూ. 1500 వరకు డిస్కౌంట్
Realme Narzo 100 Lite 5G : కొత్త రియల్‌మి ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్‌మి ఇండియా నార్జో లైనప్ నుంచి నార్జో 100 లైట్ 5జీ అనే కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ సూపర్ హై రిఫ్రెష్ రేట్, భారీ బ్యాటరీ వంటి కొన్ని అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది.
ఈ ఫీచర్లన్నింటినీ రూ. 15వేల లోపు ధరకే అందిస్తోంది. డిజైన్ విషయానికొస్తే.. ఫ్రంట్ సైడ్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో పాటు చుట్టూ సన్నని బెజెల్స్ కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ ఈ రియల్‌మి ఫోన్ ఎలాంటి కెమెరా ఐలాండ్ లేకుండా 3 సెన్సార్ల సెటప్ అందిస్తుంది.
భారత్‌లో రియల్‌మి నార్జో 100 లైట్ ధర ఎంతంటే? :
రియల్‌మి నార్జో 100 లైట్ 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ మార్కెట్లో రూ. 13,499 ధరకు అందుబాటులో ఉంది. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999 ధరకు లభిస్తుంది.
6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో హై-ఎండ్ వేరియంట్ రూ. 16,499 ధరకు అందుబాటులో ఉంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద వినియోగదారులు రూ. 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ నార్జో ఫోన్ సేల్ ఏప్రిల్ 21, 2026న ప్రారంభమవుతాయి. మొత్తానికి ఈ ఫోన్ మోడల్ రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
రియల్‌మి నార్జో 100 లైట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి నార్జో 100 లైట్ ఫోన్ 6.8-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ టాప్ బ్రైట్నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి.
మైక్రో SD కార్డ్ ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీతో పాటు 15W వైర్డ్ ఛార్జింగ్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి రియల్‌మి యూఐ 7.0 స్కిన్‌తో రన్ అవుతుంది.
రియల్‌మి నార్జో 100 లైట్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 13MP ప్రైమరీ షూటర్, ఒక సెకండరీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం వీడియో కాల్స్ చేసేందుకు ఈ ఫోన్లో 5MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంటుంది.
