Samsung Phone Prices : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోన్ల ధరలు.. ఇంత చౌకగా మళ్లీ దొరకవు!
Samsung Phone Prices : శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్ ధరలు భారీగా తగ్గాయి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర చౌకైన ధరకే లభిస్తోంది. కొనుగోలుదారులు రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Samsung Phone Prices : శాంసంగ్ ఫోన్ కొనేవారికి ఎగిరిగంతేసే న్యూస్.. ఒకవైపు స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతుంటే శాంసంగ్ మాత్రం ధరలు భారీగా తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్ మోడల్స్ ధరలన్నీ దిగొచ్చాయి.

అందులో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S25, శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ ధరలు అతి చౌకైన ధరకే లభిస్తున్నాయి. ఇంతకీ ఈ శాంసంగ్ ఫోన్లను డిస్కౌంట్ ధరకే ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర భారీగా తగ్గింపు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాతో వస్తోంది. సౌత్ కొరియాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను అమెజాన్‌లో అసలు ధర రూ. 1,29,999 నుంచి రూ. 99,999కి తగ్గించింది.

ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ లెవల్ ఫ్లాగ్షిప్ ఫోన్‌కు అద్భుతమైన ఆప్షన్. ప్రస్తుతం టైటానియం వైట్‌సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.

శాంసంగ్ గెలాక్సీ S25 భారీ తగ్గింపు : స్టాండర్డ్ శాంసంగ్ గెలాక్సీ S25 ధరలో కూడా భారీ తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నేవీ కలర్ ఆప్షన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ. 56,999కే అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 80,999 కాగా, కొనుగోలుదారులు సుమారు రూ. 24వేలు ఆదా చేయొచ్చు. మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.

శాంసంగ్ గెలాక్సీ S25 FE చౌకైన ధరకే : శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999తో పోలిస్తే.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 44,999కే లభిస్తోంది. తద్వారా ధర రూ. 15వేలకు తగ్గింది. అల్ట్రా వేరియంట్ కొనాల్సిన పనిలేదు. తక్కువ ధరలో అల్ట్రా ఫీచర్లతో కొనేసుకోవచ్చు.

బ్యాంకు ఆఫర్లు లేవు.. నేరుగా డిస్కౌంట్లు మాత్రమే : ఈ శాంసంగ్ ఫోన్లు కొనేందుకు బ్యాంకు ఆఫర్లు లేవు. కేవలం నేరుగా డిస్కౌంట్లతోనే కొనేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో పనిలేదు. నేరుగా ధర తగ్గింపుతో మీకు నచ్చిన శాంసంగ్ ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
