Gas Cylinder : ఇంట్లో గ్యాస్ టెన్షన్ వద్దు.. సిలిండర్ అయిపోతుందని ముందే ఎలా తెలుసుకోవాలి? సింపుల్ హోం ట్రిక్..!
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతుందని ముందుగానే తెలుసుకోవచ్చు. చివరిలో గ్యాస్ లేక ఇబ్బంది పడటం కన్నా ముందే తెలుసుకుని గ్యాస్ బుకింగ్ చేసుకోవడం మేలు. గ్యాస్ ఖాళీ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? ఎలా పసిగట్టాలో ఇప్పుడు చూద్దాం..
Gas Cylinder ( Image Credit : Google Gemini AI )
- గ్యాస్ సిలిండర్ ఖాళీ అయ్యేముందు కనిపించే సంకేతాలివే
- వంట గ్యాస్ సంక్షోభం సమయంలో ఇంట్లో అదనపు సిలిండర్ తప్పనిసరి
- సిలిండర్ అయిపోవడానికి వస్తుందని ముందుగానే ఇలా తెలుసుకోవచ్చు
Gas Cylinder : అసలే గ్యాస్ కొరత.. వంట గ్యాస్ బుక్ చేసినా వెంటనే వస్తుందనే గ్యారెంటీ లేదు. అందుకే చాలామంది ముందుగానే గ్యాస్ సిలిండర్ బుక్ చేసి పెట్టుకుంటున్నారు. ఇంట్లో డబుల్ సిలిండర్ ఉంటే ఓకే.. ఒకే సిలిండర్ ఉంటే కష్టమే. అందులోనూ గ్యాస్ సడెన్ గా ఖాళీ అయితే చుక్కలే..
అప్పటికప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా వెంటనే డెలివరీ కాదు.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ బుక్ చేసినా వారం వరకు రాకపోవచ్చు. అప్పటివరకూ ఇంట్లో వంట చేసుకోకుండా ఉండలేరు కదా.. అందుకే గ్యాస్ సిలిండర్ ఖాళీ అవ్వకముందే మరో సిలిండర్ బుక్ రెడీగా పెట్టుకోవాలి.
ప్రస్తుత గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యమవుతోంది. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసినా వెంటనే రావడం లేదు. ఇలాంటి సమయంలో మీరు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? ఇంట్లో వంట కష్టాలు మామూలుగా ఉండవు.
ఇలా చేస్తే గ్యాస్ టెన్షన్ అక్కర్లేదు :
అసలు గ్యాస్ లేకుండా ఇంట్లో ఏ పని చేయలేరు. అందుకే గ్యాస్ సిలిండర్ పూర్తిగా ఖాళీ అయ్యే ముందే కొన్ని చిన్న సంకేతాలు కనిపిస్తాయి. అవి ఒకసారి మీరు గమనిస్తే మాత్రం ముందుగానే కొత్త సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి గ్యాస్ టెన్షన్ లేకుండా ఉండొచ్చు.
సాధారణ పరిస్థితుల్లో అయితే ఏదో అలా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. కానీ, ఇంట్లో వంట చేస్తుండగా సడెన్ గా గ్యాస్ అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా మార్నింగ్ టైంలో లేదా ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు గ్యాస్ లేకపోతే ఆ ఇబ్బంది మాటల్లో చెప్పలేం. అన్ని పనులు ఆగిపోతాయి.
ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదని అనుకుంటే వెంటనే ఇలా చేయండి..
కొన్ని చిన్న సంకేతాలను గమనిస్తే మాత్రం గ్యాస్ సిలిండర్ త్వరలో అయిపోతుందని ముందే తెలుస్తుంది. అప్పుడు కొత్త సిలిండర్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంతకీ ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..
గ్యాస్ మంట రంగు మారితే జాగ్రత్త :
సాధారణంగా గ్యాస్ స్టౌ మంట నీలం రంగులో బలంగా ఉంటుంది. కానీ గ్యాస్ తగ్గిపోతున్నప్పుడు ఆ మంట పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. మంట బలహీనంగా కనిపిస్తుంది. పాత్రల అడుగు భాగం కూడా నల్లబడటం మొదలవుతుంది. ఇది గ్యాస్ చివరి దశకు చేరుకుంటోందని చెప్పే సంకేతం.
తడి గుడ్డతో పరీక్ష :
చాలా సింపుల్ ట్రిక్. మీరు సిలిండర్ చుట్టూ తడి గుడ్డను చుట్టి 5 నిమిషాలు చూడండి. ఆ తర్వాత గమనిస్తే సిలిండర్ పైభాగమంతా త్వరగా ఆరిపోతుంది. కానీ, గ్యాస్ ఉన్న భాగం మాత్రం కొంతసేపు తడిగానే కనిపిస్తుంది. అక్కడే గ్యాస్ ఇంకా మిగిలి ఉందని అర్థం.
గోరువెచ్చని నీళ్లతో టెస్ట్ :
ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. ఆ నీళ్లను సిలిండర్ పైభాగం నుంచి కిందకి జారేలా పోయండి. ఆ నీళ్లు తడిసినా సిలిండర్ మధ్య భాగంలో ఎక్కడైనా మీ అరచేతిని పెట్టండి. మీకు చల్లగా అనిపిస్తే గ్యాస్ తక్కువగా ఉందని అర్థం.
సిలిండర్ బరువు చెక్ చేయడం :
ప్రతి గ్యాస్ సిలిండర్‌పై ‘T.W.’ అనే లెటర్స్ ఉంటాయి. అది ఖాళీ సిలిండర్ బరువు అనమాట. సిలిండర్‌ను తూచి చూసి ఆ బరువుతో పోల్చితే లోపల ఎంత గ్యాస్ ఉందో అంచనా వేయొచ్చు. సిలిండర్ ఎత్తగానే చాలా తేలికగా అనిపిస్తే మాత్రం గ్యాస్ దాదాపు అయిపోయినట్టే.
గ్యాస్ వినియోగం బట్టి అంచనా :
ఒక ఫ్యామిలీలో సాధారణంగా ఒక సిలిండర్ 25 రోజుల నుంచి 30 రోజులు వస్తుంది. కొన్ని ఇళ్లలో తక్కువ మంది సభ్యులు ఉంటే తక్కువ గ్యాస్ పడుతుంది. కొన్నిసార్లు గ్యాస్ మూడు నెలలు కూడా వస్తుంది. అంతకన్నా పైనే రావొచ్చు. ఇక్కడ గ్యాస్ ఎంత ఎక్కువగా వాడుతున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. మీ ఇంట్లో ఎన్ని రోజుల్లో గ్యాస్ అయిపోతుందో గమనిస్తే ముందే బుకింగ్ చేసుకోవచ్చు.
ఇలాంటి చిన్నపాటి సంకేతాలను గమనిస్తే గ్యాస్ సిలిండర్ అయిపోయే ముందే తెలుసుకోవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా వంటకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే సమయానికి కొత్త సిలిండర్ బుక్ చేసుకోవడం ఎంతైనా బెటర్.. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతుందో లేదో ఈ ట్రిక్స్ ఓసారి ట్రై చేసి చూడండి.
