Salman Khan: ఇది అస్సలు ఊహించలేదు.. టాలీవుడ్ డైరెక్టర్ తో సల్మాన్ మూవీ.. క్రేజీ కాంబో సెట్ చేస్తున్న దిల్ రాజు
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సల్మాన్ ఖాన్(Salman Khan).
Director Vamsi Paidipally planning a film with Salman Khan
- సల్మాన్ తో దిల్ రాజు మూవీ
- వంశీ పైడిపల్లి చెప్పిన కథకు ఒకే చెప్పిన సల్లూభాయ్
- 2026 సెకండ్ హాఫ్ లో షురూ కానున్న షూటింగ్
Salman Khan: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారట. విజయ్ ‘వారసుడు’ ఫేమ్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతుండటం విశేషం. ఈమధ్య కాలంలో చాలా మంది టాలీవుడ్ మేకర్స్ బాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేస్తూ గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు సల్మాన్ ఖాన్(Salman Khan)తో భారీ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా రూ.350 నుంచి 400 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతున్నాడట. సాధారణంగా దర్శకుడు వంశీ పైడిపల్లి బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు. ఇప్పుడు సల్మాన్ కోసం కూడా ఆయన ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేశారట.
ఈ సినిమాలో సల్మాన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక బాధ్యతాయుతమైన, అదే సమయంలో మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మాస్టర్ మైండ్ దిల్ రాజు వారసుడు సినిమాతో కోలీవుడ్‌లో సక్సెస్ అందుకున్నట్టుగానే ఇప్పుడు బాలీవుడ్లో నేరుగా జెండా పాతాలని చూస్తున్నాడట. అందుకోసం సల్మాన్ ఖాన్ అయితేనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట. ఇక, సల్మాన్ ఖాన్ క్రేజ్‌కు వంశీ పైడిపల్లి మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్టు సమాచారం. గతంలో సల్మాన్ కోసం దేవి శ్రీ ప్రసాద్ ‘రింగ రింగ’ అనే పాటను రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోలోగా మ్యూజిక్ చేసే అవకాశం దక్కించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఇక సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తయిందని, 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఆడోయన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
