AI Create 16 New Viruses : ఏఐతో 16 కొత్త వైరస్లు.. శాస్త్రవేత్తల సంచలన ప్రయోగం.. వైద్య రంగంలో కొత్త ఆశలు.. కానీ..
AI Create 16 New Viruses : అమెరికాలోని స్టాన్పోర్ట్ యూనివర్శిటీ, ఎంఐటీ - హార్వర్డ్ బ్రాండ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 16 కొత్త వైరస్‌లను రూపొందించారు. ఇందుకోసం జనరేటివ్ ఏఐ మోడల్ ఈవో (Evo)ను ఉపయోగించారు.
Scientists Use AI to Build 16 New Viruses
AI Create 16 New Viruses : కృత్రిమ మేధ (AI) శక్తి మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఏఐ సాయంతో శాస్త్రవేత్తలు ప్రకృతిలో ఇంతకుముందు కనిపించని 16 కొత్త వైరస్‌లను రూపొందించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు చేపట్టిన ఈ ప్రయోగం బయోటెక్నాలజీ రంగంలో కీలక ముందడుగుగా నిలిచింది. మరో విశేషం ఏమిటంటే.. ఈ వైరస్లు కేవలం బ్యాక్టీరియాను మాత్రమే ప్రభావితం చేసే బ్యాక్టీరియోఫేజ్‌లు కావడంతో మానవులకు ప్రత్యక్ష ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
Also Read : Russia Black Widows : రష్యాలో ‘బ్లాక్ విడోస్’ కలకలం.. పరిహారం కోసం సైనికులతో వివాహాలు..!
అమెరికాలోని స్టాన్పోర్ట్ యూనివర్శిటీ, ఎంఐటీ – హార్వర్డ్ బ్రాండ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందుకోసం జనరేటివ్ ఏఐ మోడల్ ఈవో (Evo)ను ఉపయోగించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాక్టీరియాను మాత్రమే సోకే ఒక రకమైన వైరస్ అయిన బ్యాక్టీరియా ఫేజ్‌ను నమూనాగా తీసుకొని.. దాని జన్యు నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని ఏఐ సాయంతో వేలాది కొత్త వైరస్ జన్యు నమూనాలను రూపొందించారు. దాదాపు 300 జన్యు నమూనాలను ప్రయోగశాలలో తయారు చేసి పరీక్షించగా.. 16 వైరస్లు సజీవంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించారు.
ఈ పరిశోధనలో ప్రధాన అంశం ఏమిటంటే.. యాంటీబయాటిక్‌లకు లొంగని బ్యాక్టీరియాను ఎదుర్కోవడం. కొన్ని బ్యాక్టీరియాలు మందులకు నిరోధకత పెంచుకోవడంతో వాటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం వైద్య రంగానికి సవాలుగా మారింది. బ్యాక్టీరియోఫేజ్‌లు నిర్దిష్ట బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో భవిష్యత్తులో ఫేజ్ థెరపీ వంటి చికిత్సా విధానాల్లో వీటిని ఉపయోగించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈవో (Evo) ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది డీఎన్ఏలోని ప్యాటర్న్స్‌ను నేర్చుకొని.. వాటిని విశ్లేషిస్తుంది. దీనికి లక్షల సంఖ్యలో జీవుల జన్యుక్రమాలపై శిక్షణ ఇచ్చారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
మరోవైపు.. ఏఐతో కొత్త వైరస్ జన్యు నిర్మాణాలను రూపొందించే సామర్థ్యం భద్రతాపరమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ఏఐ సాంకేతికత అభివృద్ధి వేగానికి అనుగుణంగా బయోసెక్యూరిటీ, నియంత్రణ వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతికత దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ, ప్రయోగశాల భద్రత, జన్యు సాంకేతికతపై నియంత్రణలు కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
