ఒకే ఒక్క స్టేటస్ పెట్టి అమితాసక్తి రేపిన ప్రభాస్.. త్వరలో పెళ్లి?
Prabhas: ‘వెయిట్ చేయండి’ అంటూ తెలుగులోనూ ప్రభాస్ స్పష్టంగా పేర్కొన్నాడు. దీనిపై..

prabhas
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటసే అందుకు కారణం. ‘డార్లింగ్స్.. మా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు.. వెయింట్ చేయండి’ అని ప్రభాస్ చెప్పాడు. దీంతో కాబోయే భార్యను పరిచయం చేస్తాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ పెళ్లి గురించి గతంలోనూ అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు స్వయంగా ప్రభాసే స్టేటస్ పెట్టడంతో దీనిపై మరిన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? వంటి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభాస్ పెట్టకున్న స్టేటస్ తప్పకుండా పెళ్లి గురించే అయుండొచ్చన్న ఆసక్తి నెలకొంది. అమ్మాయి ఎవరు? అని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
‘వెయిట్ చేయండి’ అంటూ తెలుగులోనూ ప్రభాస్ స్పష్టంగా పేర్కొన్నాడు. దీనిపై క్లారిటీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ పెట్టిన స్టేటస్ ఈ సినిమాకు సంబంధించిందన్న ప్రచారమూ జరుగుతోంది.
ప్రభాస్ బాహుబలి సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. దీంతో ప్రభాస్ పెళ్లిపై టాలీవుడ్ అభిమానులతో పాటు దేశంలోని అన్ని భాషల అభిమానుల్లోనూ ఆసక్తి ఉంది. ప్రభాస్ చెప్పిన ఆ ‘స్పెషల్ పర్సన్’ ఎవరు? సినిమా గురించి అన్నాడా? అన్న విషయాలు ఆయన మరో పోస్ట్ చేసేదాక సస్పెన్స్‌గానే ఉంటాయి.
Also Read : అండమాన్ నికోబర్ దీవుల్లో రొమాంటిక్ సాంగ్ షూట్.. దేవర షూటింగ్ అప్డేట్..