తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. మినీ వ్యాను బోల్తా, భక్తులకు గాయాలు

డీజిల్ కారణంగా టీటీడీ వాటర్ ట్యాంకర్ స్కిడ్ అయ్యింది. వాటర్ ట్యాంకర్ రోడ్డుకు ఆడ్డంగా నిలబడిపోయింది.

Tirumala Ghat Road Incident : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు మాల్వాడి గుండం వద్ద ప్రమాదం జరిగింది. మినీ వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రోడ్డుపై పడ్డ మినీ వ్యాన్ నుండి డీజిల్ లీక్ అయ్యింది. డీజిల్ కారణంగా టీటీడీ వాటర్ ట్యాంకర్ స్కిడ్ అయ్యింది. వాటర్ ట్యాంకర్ రోడ్డుకు ఆడ్డంగా నిలబడిపోయింది. దీంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు.

మొదటి ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన కారు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 19వ మలుపు వద్ద జరిగిన మరో ప్రమాదంలో కారు అదుపు తప్పి రాళ్ల పైకి దూసుకెళ్లింది. కారులోని భక్తులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

తిరుమల ఘాట్ రోడ్‌లో మినీ వ్యాను బోల్తా…

కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. ఏడు కొండలపై కొలువైన స్వామిని దర్శించుకోవాలంటే ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాల్సిందే. అయితే ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయాలంటే వాహనాలు నడిపే వారికి అనుభవం ఉండాలి.

ఘాట్ రోడ్ లో అనేక మలుపులు ఉంటాయి. వాటి గురించి అవగాహన ఉండాలి. స్పీడ్ ను కంట్రోల్ చేయగలగాలి. ఏ మాత్రం పట్టు తప్పినా ప్రమాదాల బారిన పడటం ఖాయం. ఘాట్ రోడ్డుల్లో అతి వేగం అత్యంత ప్రమాదకరం. అయితే, కొన్ని సార్లు డ్రైవర్లు స్పీడ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మలుపుల దగ్గర వాహనాన్ని అదుపు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దాని కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు.

రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన టీటీడీ వాటర్ ట్యాంకర్..

Also Read : చంద్రబాబుకు భద్రత పెంపు.. ఏపీలో జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ట్రెండింగ్ వార్తలు