Vijaysai Reddy: తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో ఉండాలి చెల్లెమ్మా.. పురందేశ్వరిపై విజయసాయి ట్వీట్

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో టీడీపీని కలిపేందుకు దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోంచారు.

vijaysai reddy tweet on purandeswari over NTR properties

Vijaysai Reddy- Purandeswari : ప్రఖ్యాత నటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నాణేన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీతో టీడీపీని కలిపేందుకు దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోంచారు.

 

దివంగత ఎన్టీఆర్ కు సమాధి తప్ప స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణేం అంటారని పురేందేశ్వరిని ఉద్దేశించి విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న గురించి ఢిల్లీలో ఏనాడు అడగలేదంటూ ఆరోపించారు. తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలే కానీ.. పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా అంటూ ఎద్దేవా చేశారు. వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారని విమర్శించారు. అబిడ్స్ లో ఎన్టీఆర్ ఇల్లు కూడా అమ్ముకున్నారని ఆక్షేపించారు.

 

కాగా, ఎన్టీఆర్ స్మారక నాణేం ఆవిష్కరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి వాపోయారు. NTR భార్యగా తనను పిలవకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వల్లే వీరిద్దరూ రాలేదని సమాచారం.

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ ఎంపీలు కనకమెడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, నందమూరి బాలకృష్ణ, అశ్వినిదత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read: ఇన్నాళ్లూ సైలెంట్ ఉన్నా.. ఇకపై వాళ్లను వదిలిపెట్టను.. అందరినీ బయటకు లాగుతా.. లక్ష్మీపార్వతి వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు