YSRCP Protest: అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు జగన్ సీరియస్ వార్నింగ్.. పోలీసులు ఏం చేశారంటే..?

వైయస్‌ జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు ధరించిన అసెంబ్లీకి వెళ్లారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు..

YS Jagan

YS Jagan Mohan Reddy : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నిరసన తెలుపుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లకార్డులు లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై జగన్ సీరియస్ అయ్యారు. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలోఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు అంటూ పోలీసుల ను ఉద్దేశించి వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : AP Assembly Session 2024: గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్.. Live Updates

వైయస్‌ జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు ధరించిన అసెంబ్లీకి ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ‘సేవ్‌ డెమొక్రసీ’ అని నినాదాలు చేశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లను పోలీసులు లాక్కుని చింపివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై వైయస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను జగన్ గట్టిగా నిలదీశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జులుం ఎళ్లకాలం సాగబోదు.. పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ జగన్ హెచ్చరించారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమని జగన్ అన్నారు. యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంకోసం కాదని గుర్తుంచుకోవాలంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారని గట్టిగా నిలదీశారు.

Also Read : Nagarjuna Yadav : కుప్పం పోలీసుల అదుపులో వైసీపీ నేత నాగార్జున యాదవ్

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే.. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్‌ డెమొక్రసీ.. అంటూ సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ.. గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలతో, నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసి జగన్ సహా, వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.

 

ట్రెండింగ్ వార్తలు