బీజేపీవైపు వైసీపీ నేతల చూపు..! మంత్రి లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ

వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి.

Bjp Mlas Meet Lokesh : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలపై దాడుల అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమితో కొందరు వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తోంది. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు వైసీపీ నాయకులు జాతీయ పార్టీ అయిన బీజేపీవైపు చూస్తున్నారని.. బీజేపీ నాయకులు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీ నేతలు బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఈ ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీలోని మంత్రి చాంబర్ లో లోకేశ్ తో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, ఈశ్వర రావు ఉన్నారు. చాలామంది వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని నేతలు వ్యాఖ్యానించారు. అయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదని బీజేపీ తెలిపింది. అలాంటిది ఏమైనా ఉంటే, కలిసి చర్చించాకే నిర్ణయం తీసుకుందామని వెల్లడించారు.

వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. బీజేపీలో చేరాలని అనుకుంటున్న వైసీపీ నాయకులు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేతల వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లోనూ డిస్కషన్ కు దారితీశాయి.

Also Read : ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం

 

ట్రెండింగ్ వార్తలు