JioMart On Whatsapp Chat : జియోమార్ట్ యూజర్లకు గుడ్‌ న్యూస్.. ఇకపై నేరుగా వాట్సాప్ చాట్‌లోనే షాపింగ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

JioMart On Whatsapp Chat : జియోమార్ట్ (JioMart) యూజర్లకు గుడ్‌న్యూస్.. దేశీయ ప్రముఖ ఈ-మార్కెట్లలో ఒకటైన రిలయన్స్ రీటెయిల్ జియోమార్ట్ (Retail JioMart) కొత్తగా వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.

JioMart On Whatsapp Chat : జియోమార్ట్ (JioMart) యూజర్లకు గుడ్‌న్యూస్.. దేశీయ ప్రముఖ ఈ-మార్కెట్లలో ఒకటైన రిలయన్స్ రీటెయిల్ జియోమార్ట్ (Retail JioMart) కొత్తగా వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌ (Whatsapp)లో మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ ప్రారంభించినట్లు ఇటీవలే రిలయన్స్ జియో (Reliance Jio) ప్రకటించింది. జియోమార్ట్ యూజర్లు తమ వాట్సాప్ చాట్‌లోనే JioMart నుంచి నేరుగా షాపింగ్ చేయవచ్చు. ఈ సర్వీసు కోసం యూజర్లు JioMart మొత్తం కిరాణా కేటలాగ్‌ (Groceries Catalog)ను బ్రౌజ్ చేసేందుకు కార్ట్‌ (Cart)కు వస్తువులను యాడ్ చేసుకోవచ్చు. జియోమార్ట్ యూజర్లు తమ వాట్సాప్ చాట్ (Whatapp Chat) నుంచి బయటకు రాకుండానే చాట్‌పైనే మీకు నచ్చిన కిరాణా సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు.

Reliance Jio Now Lets Jiomart Users Shop Groceries Directly From Whatsapp

అంతేకాదు. వాట్సాప్ చాట్‌లోనే పేమెంట్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్‌పై జియోమార్ట్‌ను అందించేందుకు జియో మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. అలాగే ప్రొడక్టులను తమ కార్ట్‌కు యాడ్ చేయవచ్చు. అక్కడే పేమెంట్ చేసి షాపింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ఫ్రీ సర్వీసును ఉపయోగించి యూజర్లు నచ్చిన ఆర్డర్ చేయవచ్చు. ఇందుకు వినియోగదారులకు సమయంతో సంబంధం లేదు. అలాగే ఎంత పరిమాణంలో షాపింగ్ చేయాలి అనేది ఆంక్షలు కూడా లేవు. మీరు మైసూరు లేదా జైపూర్ లేదా పాట్నాలో ఎక్కడ ఉన్నా మీరు మీ ఇంట్లో సౌకర్యవంతంగా కూర్చొని ఏ సమయములో అయినా వాట్సాప్ ద్వారా మీ రోజువారి అవసరాలను ఎంచుకొని ఆర్డర్ చేసుకోవచ్చు.

జియోమార్ట్ సర్వీసును ఎలా వాడాలంటే? :
మీరు చేయాల్సిందిల్లా.. ఈ వాట్సాప్ సర్వీసును ఉపయోగించాలంటే.. వాట్సాప్‌లోని JioMart నంబర్‌కు ‘Hi’ని పంపాల్సి ఉంటుంది. జియోమార్ట్ నెంబర్ (+917977079770)కు వాట్సాప్‌పై ‘Great Deals on JioMart’ అని పంపించాలి. మీరు వెంటనే షాపింగ్ క్యాటలాగ్, కరెంట్ అఫైర్స్, డీల్స్‌పై నోటిఫికేషన్లు అందుకోవచ్చు. ఈ వేదిక ద్వారా ఆర్డర్ చేస్తే.. రియల్ టైమ్ అప్‌డేట్స్ అప్డేట్స్ అందుకోవచ్చు. మీ ఆర్డర్స్ స్టేటస్ గురించి తెలసుకోవచ్చు.

Read Also : JioGamesCloud Gaming Beta : జియో గేమర్లకు శుభవార్త.. భారత్‌లో జియో కొత్త క్లౌడ్ గేమింగ్, జియోగేమ్స్ క్లౌడ్‌.. ఆన్‌లైన్‌లో ఫ్రీ గేమ్స్ ఎలా ఆడాలో తెలుసా?

అంతేకాదు.. మీకు ఏదైనా సమస్య ఉంటే Help కోసం సంప్రదించవచ్చు. కనీస కార్ట్ విలువ రూ. 250కు కొనుగోలు చేయవచ్చు. తద్వారా కచ్ఛితమైన 30శాతం తగ్గింపును పొందవచ్చు. రూ. 120 గరిష్ఠ రాయితీని కూడా పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వాట్సాప్ ద్వారా ఇప్పుడే మీకు నచ్చిన ప్రొడక్టు ఆర్డర్ చేసుకోండి. జియోమార్ట్ (JioMart)పై వాట్సాప్ ద్వారా కొనుగోళ్ళు చేయాలంటే.. +91 7977079770 కు ‘Hi’ అని పంపండి లేదా https://wa.me/+917977079770 ఈ ఇంక్ పై క్లిక్ చేయండి. (క్యాటలాగ్ పొందాలంటే ‘Great deals on JioMart’ అని పంపండి లేదా ఈ కింది QR Code స్కాన్ చేయొచ్చు.

Reliance Jio Now Lets Jiomart Users Shop Groceries Directly From Whatsapp

ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్లలో ఒకటిగా .. :
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ అనేది RIL (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) గ్రూప్ కింద అన్ని రిటైల్ కంపెనీలకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. అయితే గత మార్చి 31, 2022 చివరి నాటికి రూ. 199,704 కోట్లు (26.3 బిలియన్ డాలర్లు), నికర లాభము రూ. 7,055 కోట్ల ( 931 మిలియన్ డాలర్లు) ఏకీకృత టర్నోవర్‌ను RRVL నివేదించింది. డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ రీటెయిలింగ్ 2022 సూచికలో ప్రపంచములోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్‌లో ఒకటిగా నిలిచింది. బెస్ట్ గ్లోబల్ రిటైలర్స్ జాబితాలో 56వ స్థానంలో నిలిచింది. బెస్ట్ 100 రిటైలర్లలో ఒకటిగా నిలిచింది.

భారత రిటైల్ జియోమార్ట్ 2020లో ప్రారంభమైన ఈ-టెయిల్ ఆర్మ్. సౌకర్యవంతమైన సేవలు, వైవిధ్యభరితమైన ఉత్పత్తులతో సులభంగా-ఉపయోగించగలిగే ఇంటర్ఫేస్, త్వరిత డెలివరీ, అసమానమైన డీల్స్‌తో విక్రేతలు, కొనుగోలుదారులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. 20+ కేటగిరీలలో 2 మిలియన్ల ప్రొడక్టులతో సరఫరాదారుగా స్వదేశీ ఈ-మార్కెట్‌లో డిజిటల్ అగ్రగామిగా నిలువనుంది. ఇటీవల దేశంలో ముందుగా ప్రధాన నగరాలైన కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై సహా 4 నగరాలకు జియో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు డిసెంబర్ 2023 నాటికి Jio 5G Services పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 14 : జియోమార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు